బిజినెస్

ఊటీలో బీలైవ్ ఎలక్ట్రికల్ వాహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 10: టూరిజం స్టార్ట్‌ప్ సంస్థ బీలైవ్ ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా ఈ రంగానికి కొత్త శోభలను తీసుకొస్తున్నది. అందు లో భాగంగానే ఇప్పుడు తమిళనాడుకు తన మార్కెట్‌ను విస్తరించింది. ఊటీలో విద్యుత్ వాహనాల ద్వారా పర్యాటక రంగానికి ఈ కంపెనీ ఊతమిస్తున్నది. ఎలక్ట్రికల్ బైక్‌లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం ద్వారా కర్బన కాలుష్యాన్ని తగ్గించే దిశగా మరో అడుగు ముందుకేసింది. గోవా, పాండిచ్ఛేరి, కర్నాటక, రాజస్థాన్, కేరళలో ఇప్పటికే ఈ-బైక్‌లను ప్రవేశపెట్టిన బీలైవ్ ఇప్పుడు ఊటీలోనూ పర్యావరణానికి ఎలాంటి హాని చేయని ఈ-బైక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఊటీని మరింత అందంగా, కాలుష్య రహితంగా తీర్చిదిద్దడంలో భాగంగానే తాము ఈ-బైక్‌ను ప్రవేశపెట్టామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు సందీప్ ముఖర్జీ, సీఈశో సమర్థ్ కొల్కర్ ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. 50 కిలోమీటర్ల పరిధిలో ఈ-బైక్స్‌పై తిరగవచ్చని, చార్జీ లు వాటికి అమర్చి ఉండే డిజిటల్ స్క్రీన్‌పై ఎప్పటికప్పుడు కనిపిస్తాయని వివరించారు. కాగా, ఈ- బైక్‌ల వాడకం వల్ల పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని భారత జాతీయ కళలు, సాంస్కృతిక వారసత్వ ట్రస్టు కన్వీనర్ గీతా శ్రీనివాసన్ తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఏటా ఊటీకి లక్షలాది మంది టూరిస్టులు వస్తుంటారని, వారికి ఈ-బైక్‌లను అం దుబాటులో ఉంచే ప్రయత్నం జరగడం ముదావహమని పేర్కొన్నారు. పర్యాటక కేంద్రాల్లో విద్యుత్ వాహనాల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.