బిజినెస్

భవిష్యత్తు విద్యుత్ వాహనాలదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పర్యావరణ కాలుష్యం పెరుగుతూ, రోజురోజుకూ కొత్త వైరస్‌లు వ్యాప్తి చెందుతున్న తరుణంలో విద్యుత్ వాహనాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండనుంది. ఈ-వాహనాలకు దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటి వల్ల వినియోగదారులకు ఇంథన ఖర్చు తగ్గుతుంది. పర్యావరణ కాలుష్యాన్ని కొంత వరకైనా అరికట్టవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలిసిన విషయమే. దేశ వ్యాప్తంగా సుమారు 30 నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకోనున్నాయని అధ్యయనాలు తేల్చిచెప్తున్నాయి. అందుకే, అనేకానేక సంర్భాల్లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని, కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఇవ్వాల్సి వస్తున్నది. ఈ క్రమంలోనే విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఫాస్టర్ అడాప్షన్ అండ్ మానుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా (ఫేమ్) పేరుతో కొత్త ప్రథకాన్ని కేంద్ర సర్కారు ప్రారంభించింది. మొదటి దశలో, విద్యుత్ బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు తయారు చేసే అంకుర కంపెనీలకు భారీగా సబ్సిడీలను ఇచ్చింది. వివిధ రకాల ప్రోత్సాహకాలను అందించింది. ఇటీవలే ప్రకటించిన రెండో దశలో విద్యుత్ కార్లు, ద్విచక్ర వాహనాలకు భారీ సబ్సిడీని ప్రకటించింది. సుమారు పది ఎలక్ట్రికల్ టూ-వీలర్స్‌పై, 20,000 రూపాయల చొప్పున రాయితీని ఇస్తున్నారు. అదే విధంగా పూర్తిగా విద్యుద్దీకరించిన కార్లకు 1.5 లక్షల రూపాయల సబ్సిడీని చెల్లిస్తారు. 35,000 విద్యుత్ కార్లకు ఈ పథకం వర్తిస్తుంది. మొత్తం 10,000 కోట్ల రూపాయల వ్యయంతో, కనీసం మరో రెండేళ్లపాటు ఈ పథకాన్ని కొనసాగిస్తారు. ఐదు కోట్ల రూపాయలకు మించని 7,090 ఈ-బస్సులకు ఎక్స్ ఫ్యాక్టరీ ధరపై ఐదు లక్షల రూపాయల దాకా రాయితీని ఇచ్చారు. అంతేగాక, ఒక్కో వాహనానికి సుమారు 50 లక్షల రూపాయల వరకూ ఇనె్సన్టివ్ అందించారు. ఐదు లక్షల రూపాయలలోపు ఖరీదు చేసే ఈ-రిక్షాలకు, ఒక్కోదానికీ 50,000 రూపాయల చొప్పున ఇనె్సన్టివ్ లభించింది. ఈసారి, కార్లు, ద్విచక్ర వాహనాలకు రాయితీలను ఇస్తారు. ఈ ప్రోత్సాహకాల వల్ల ప్రజలు విద్యుత్ వాహనాల పట్ల మొగ్గుచూపే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణ ఆవస్యతకపై ఇటీవల కాలంలో ప్రజల్లో అవగాహన పెరుగుతున్నది. దీనికితోడు ప్రభుత్వాల ప్రోత్సాహం కూడా ఉండడంతో, విద్యుత్ వాహనాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే ధీమా సర్వత్రా వ్యక్తమవుతవున్నది.