బిజినెస్

మార్కెట్లకు స్వల్ప లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 11: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో రిస్క్ సెంటిమెంట్‌దే పైచేయిగా ఉన్నప్పటికీ ఇండెక్స్‌లోని దిగ్గజ కంపెనీలకు విలువ ఆధారంగా మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం వల్ల మార్కెట్లు స్వల్ప లాభాలు ఆర్జించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెన్సెక్స్ ఇంట్రా-డేలో ఒక దశలో 386 పాయింట్లు పైకి ఎగబాకినప్పటికీ తరువాత వాటిని నిలబెట్టుకోలేక పోయింది. చివరకు ఈ సూచీ క్రితం ముగింపుతో పోలిస్తే 62.45 పాయింట్ల (0.18 శాతం) ఎగువన 35,697.40 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 6.95 పాయింట్ల (0.07 శాతం) ఎగువన 10,458.40 పాయింట్ల వద్ద స్థిరపడింది. మదుపరులు ఇటీవల బాగా ధరలు తగ్గిన ఇంధన, బ్యాంకింగ్, వినియోగ వస్తువుల రంగాల షేర్లను ఎంచుకొని అప్రమత్తతతో కొనుగోళ్లు చేశారని వ్యాపారులు తెలిపారు.
సెన్సెక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో హీరో మోటోకార్ప్ (4.08 శాతం), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.60 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (1.80 శాతం), హెచ్‌యూఎల్ (1.51 శాతం) ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్ షేర్లు 7.11 శాతం వరకు నష్టపోయాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందిన పరిస్థితుల్లో దేశంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండటం వల్ల మదుపరులలో అధైర్యం పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తొలుత ఆర్జించిన లాభాలను నిలబెట్టుకోలేక పోయాయని మార్కెట్ విశే్లషకులు పేర్కొన్నారు. ఢిల్లీ, రాజస్థాన్‌లో తాజాగా మరో రెండు కరోనా వైరస్ కేసులు బయటపడటంతో దేశంలో ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన వారి సంఖ్య బుధవారం 60కి పెరిగింది. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి 4,000కు పైగా మందిని బలిగొంది. సుమారు ఒక లక్షా 20వేల మందికి ఈ అంటువ్యాధి సోకింది. ‘గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల జోక్యంతో పెరిగిన ద్రవ్య లభ్యత వల్ల మార్కెట్లు పుంజుకున్నట్టు కనపడుతోంది. కరోనా వైరస్ ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించకుండా నిరోధించడానికి అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఆర్థిక ఉద్దీపక చర్యలు తీసుకుంటుండడంతో ఆ దేశ మార్కెట్లు రాత్రికి రాత్రి పుంజుకున్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు.