బిజినెస్

28,979 స్టార్టప్ కంపెనీలకు గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: దేశంలో 28,979 స్టార్టప్ కంపెనీలకు డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇం టర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గుర్తింపు లభించినట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. మ హారాష్టల్రో 5,477, కర్నాటకలో 4,206, ఢిల్లీలో 3,740, ఉత్తరప్రదేశ్‌లో 2,342, హర్యానాలో 1,635, తెలంగాణలో 1,069, గుజరాత్‌లో 1,555, తమిళనాడులో 1,509 స్టార్టప్ కంపెనీలను డీపీఐఐటీ గుర్తించినట్టు ఆయన చెప్పారు. ఈ కంపెనీలకు భారత్ స్టార్టప్ ఇండియా పథకం కింద పన్ను మినహాయింపు, ఇతర చట్టబద్ధమైన మినహాయింపులు లభిస్తాయని ఆయన అన్నారు. డీపీఐఐటీ ఇంతవరకు గుర్తించిన 27,137 స్టార్టప్ కంపెనీల్లో 3,37,335 మందికి ఉద్యోగావకాశాలు వచ్చినట్టు ఆయన వివరించారు. నిధులను అందించేందుకు వీలుగా ఫండ్ ఆఫ్ ఫండ్ ఫర్ స్టార్టప్స్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) 10 వేల కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్‌గా ఉంచిందని ఆయన అన్నారు. అదేవిధంగా సెబీ 25,728 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ సిద్ధంగా ఉంచినట్టు ఆయన పేర్కొన్నారు.
*చిత్రం... కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్