బిజినెస్

1,27,160.65 కోట్ల రూపాయల నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కరోనా వైరస్‌ను ఒక మహమ్మారిగా అభివర్ణిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూటీవో) చేసిన ప్రకటన భారత స్టాక్ మార్కెట్లను నిలువునా ముంచేసింది. ఎనర్జీ, బ్యాంక్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఇండస్ట్రీస్, ఐటీ సెక్టార్ల షేర్లు దారుణంగా నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ సూచీలు 2,919.26 పాయింట్లు (8.18 శాతం), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 868.25 పాయింట్లు (8.30 శాతం) పతనమయ్యాయి. ఎవరూ ఊహించని పరిణామంతో మార్కెట్లు ‘బేర్’మన్నాయి. మదుపరులు ఏకంగా 11,27,160.65 కోట్ల రూపాయలు నష్టపోయారు. బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 1,25,86,398.07 కోట్ల రూపాయలు పడిపోయింది. బుధవారం లావాదేవీలు ముగిసే సమయానికి 1,37,13,558.72 కోట్ల రూపాయలుగా ఈ విలువ భారీ పతనానికి గురైంది. దీనితోపాటు 2,265 కంపెనీలు నష్టాలను చవిచూడగా, కేవలం 201 కంపెనీలు లాభాల్లో నడిచాయి. 1,180 కంపెనీల విలువ గత 52 వారాల్లో ఎన్నడూ లేని రీతిలో నష్టపోయాయి. ఇలావుంటే, ఈ పతనం కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. డబ్ల్యూహెచ్‌వో చేసిన ప్రకటన, సత్వర నివారణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి దారుణంగా మారుతుందన్న హెచ్చరిక మదుపరులను ఆందోళనకు గురి చేసింది. భవిష్యత్తు మరింత సంక్లిష్టంగా ఉంటుందన్న అనుమానంతో, చేతిలో ఉన్న స్టాక్స్‌ను అమ్మేయాలన్న నిర్ణయానికి రావడంతో, మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. స్టాక్ మార్కెట్ల సూచీలు ఒక్కసారిగా పతనమైంది.