బిజినెస్

ఎస్ బ్యాంక్ రేటింగ్స్‌లో మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి, దివాలాకు చేరువైనప్పటికీ, ఎస్బీఐసహా పలు బ్యాంకులు పెట్టుబడులకు ముందుకు రావడంతో కోలుకుంటున్న ఎస్ బ్యాంక్ ఇప్పుడు రేటింగ్స్‌ను కూడా మెరుగుపరచుకుంది. భారీ బకాయిలు, ఇతరత్రా సమస్యల కారణంగా ఇది వరకూ ఈ బ్యాంక్‌ను రేటింగ్ వాచ్ నెగెటివ్ (ఆర్‌డబ్ల్యూఎన్) కింద చేర్చారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతున్న కారణంగా రేటింగ్ వాచ్ ఎవాల్వింగ్ (ఆర్‌డబ్ల్యూఈ) జాబితాలోకి చేర్చినట్టు భారత రేటింగ్స్, పరిశోధన (ఇంద్ర) ఒక ప్రకటనలో తెలిపింది. దివాలా దశలో ఉన్న బ్యాంక్‌ను ఆదుకోవడానికి ఆర్బీఐ 4,500 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను కొంటున్న విషయం తెలిసిందే. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా పెట్టుబడులను పెట్టనుంది. దీనితో ఎస్ బ్యాంక్ షేర్ల విలువ స్టాక్ మార్కెట్లో దూసుకెళ్లింది. 50 నుంచి 60 శాతం పెరిగింది.
ఇలావుంటే, బ్యాంక్ నిరర్ధక ఆస్తులు ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 7.39 శాతం ఉండగా, మూడో త్రైమాసికంలో 18.87 శాతానికి పెరిగాయి. బ్యాంక్ ఆర్థికంగా దెబ్బతినడానికి నిరర్ధక ఆస్తుల పెరుగుదలే ప్రధాన కారణం. దీనికితోడు పాలక మండలి ఏకపక్ష నిర్ణయాలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలు కూడా ఎస్ బ్యాంక్‌ను దెబ్బతీశాయి. ఎస్బీఐ భారీ పెట్టుబడులతో ఈ బ్యాంక్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదించుకునే అవకాశాలున్నాయి.