బిజినెస్

ఓ రకం వెంటో, ర్యాపిడ్ కార్ల విక్రయాలను నిలిపివేసిన ఫోక్స్‌వాగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: జర్మనీ ఆటోరంగ దిగ్గజం ఫోక్స్‌వాగన్ (విడబ్ల్యు).. భారత్‌లో వెంటో మోడల్‌కు చెందిన 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కార్ల విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేగాక 3,877 యూనిట్లను రీకాల్ చేసింది. అలాగే విడబ్ల్యు గ్రూప్‌నకు చెందిన స్కోడా బ్రాండ్‌లోని ర్యాపిడ్ మోడల్ అమ్మకాలను ఆపేసింది. ఆమోదయోగ్య స్థాయిని మించి కర్బన ఉద్గారాలు విడుదలవడమే దీనికి కారణమని ఫోక్స్‌వాగన్ గ్రూప్ ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపింది. ఈ కార్ల మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కూడా పరిశీలించనున్నట్లు ఫోక్స్‌వాగన్ చెప్పింది.

బీమా సంస్థల్లో వాటాలను
విక్రయించిన ఐసిఐసిఐ బ్యాంక్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్.. తమ జనరల్ ఇన్సూరెన్స్ వెంచర్ ఐసిఐసిఐ లాంబార్డ్‌లో 9 శాతం వాటాను, లైఫ్ ఇన్సూరెన్స్ అనుబంధ సంస్థ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌లో 2 శాతం వాటాను దాదాపు 2,200 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు శుక్రవారం తెలిపింది. ఫెయిర్‌ఫాక్స్‌కు ఐసిఐసిఐ లాంబార్డ్ వాటా, కంపాస్‌వెల్ ఇనె్వస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాటాను అమ్మింది.

హెచ్‌పిసిఎల్ సిఎండిగా
ఎంకె సురానా
హైదరాబాద్, ఏప్రిల్ 1: కేంద్ర ప్రభుత్వం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా ముఖేష్ కుమార్ సురానాను నియమించింది. ఆయన శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఇంత వరకూ ఈ పదవిలో కొనసాగిన నిషీ వాసుదేవ మార్చి 31న పదవీ విరమణ చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన ఎంకె సురాన 2012 నుండి ప్రైజ్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. చమురు, సహజ వాయువు రంగంలో ఆయనకు 33 ఏళ్ల అనుభవం ఉంది. బిజినెస్ ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ రిఫైనరీ ఆపరేషన్లు, కార్పొరేషన్ వ్యాప్తంగా ఈఆర్‌పి అమలులో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.