బిజినెస్

12 వేల ఆర్టీసీ బస్సుల నిలిపివేతతో రూ. 13 కోట్ల రాబడికి గండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: జనతా కర్ఫ్యూలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మొవ్వా తిరుమల కృష్ణబాబు అవసరమైన చర్యలు తీసుకున్నారు. రోడ్డుపైకి ప్రజాలెవరూ బయటకు రాకుండా నిరోధించేందుకు ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 12వేల బస్సులను శనివారం అర్ధరాత్రి నుంచి ఎక్కడికక్కడ డిపోల్లో నిలిపివేశారు. అయితే హైదరాబాద్, విశాఖ, తిరుపతి వంటి సుదూర ప్రాంతాలకు ఆదివారం ఉదయం 6గంటల లోపు చేరగలిగే బస్సులను మాత్రమే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బయలుదేర దీశారు. ఆదివారం రాత్రి 10గంటల తర్వాత నుంచి అవసరమైన మేర బస్సులు నడిపేందుకు తగిన చర్యలు చేపట్టారు. బస్సులన్నింటినీ ఎక్కడికక్కడ నిలిపివేయడం వల్ల ఒక్కరోజులోనే రూ. 13కోట్లు రాబడికి గండి పడినట్లైంది. ప్రైవేట్ బస్సులను ఎక్కడికక్కడ నిల్పివేయాలంటూ మంత్రి పేర్ని నాని యాజమానులకు విజ్ఞప్తి చేశారు.
నేడు పెట్రోలు బంకులన్నీ బంద్
జనతా కర్ప్యూకు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ తమ సంఘీభావం తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా ఆదివారం ఉదయం 7నుంచి రాత్రి 9గంటల వరకు పెట్రోలు బంకులన్నింటినీ మూసివేస్తున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ తెలిపారు.