బిజినెస్

డీజిల్ కార్లన్నింటిపైనా నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఫోక్స్‌వాగన్ కాల్యుష్య నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో రాబోయే ఆరు నెలల్లో దేశంలోని అన్ని సంస్థల డీజిల్ కార్లపై నిఘా వేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఆయా సంస్థలు కూడా నిబంధనలు పాటించాయో, లేదోననేదానిపై ఆటోమోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఆర్‌ఎఐ) ఈ ఆరు నెలలు అన్ని డీజిల్ ప్యాసింజర్ కార్లను పరిశీలించనుంది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి అనంత్ గీతే బుధవారం ఇక్కడ తెలిపారు. ఈ నెల నుంచి ఆరు నెలలపాటు డీజిల్ కార్లపై కనే్నస్తామని, కాలుష్య నిబంధనలపరంగా వాటిని క్షుణ్ణంగా పరీక్షిస్తామని స్పష్టం చేశారు. తొలుత కాలుష్య ఉద్గారాల పరీక్షల్లో మోసం చేసి ఫోక్స్‌వాగన్ పాసైనప్పటికీ, ఆ తర్వాత ఆ సంస్థ కార్లను బయట తిరుగుతున్నప్పుడు చేసిన పరీక్షల్లో అసలు విషయం బయటపడింది. దీనిపై మంత్రి స్పందిస్తూ ‘ఇది చాలా తెలివిగా చేసిన నేరం’గా అభివర్ణించారు. ఈ క్రమంలో ఇతర సంస్థలేవైనా ఇదే తరహా మోసానికి పాల్పడ్డాయా? అన్న కోణంలోనే ఈ ఆరు నెలల పరీక్షలకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. కాగా, ఫోక్స్‌వాగన్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తున్నట్లు అనంత్ గీతే చెప్పారు. కాలుష్య నిబంధనల ఉల్లంఘన వ్యవహారంలో మంగళవారం ఫోక్స్‌వాగన్ తమ బ్రాండ్లైన ఫోక్స్‌వాగన్‌తోపాటు, ఆడీ, స్కోడా మోడళ్ళకు చెందిన 3,23,700 కార్లను రీకాల్ చేసినది తెలిసిందే.

జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్‌కు ప్రతిష్ఠాత్మక పిహెచ్‌డి అవార్డు

హైదరాబాద్, డిసెంబర్ 2: సామాజిక, సంక్షేమ సేవలందించినందుకుగాను ప్రతిష్ఠాత్మక పిహెచ్‌డి చాంబర్ అవార్డు 2015కి జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్‌కు దక్కింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా జిఎంఆర్ గ్రూప్ ట్రాన్స్‌పోర్టేషన్, హైవేస్ చైర్మన్ బివిఎన్ రావు జిఎంఆర్ తరఫున ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా బివిఎన్ రావు మాట్లాడుతూ తాము వ్యాపార ధృక్పథంతోనే కాకుండా తమ వ్యాపార నిర్వహణ ప్రాంతాల్లో సామాజిక అవసరాలైన విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలను పెంచేందుకు అవసరమైన సేవలను అందించాలనే పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ సిఇఒ డాక్టర్ వి రఘునాథన్ మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డు లభించడంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు.

స్వల్పంగా పెరిగిన బజాజ్ అమ్మకాలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దేశీయ ప్రముఖ ఆటోరంగ సంస్థ బజాజ్ ఆటో అమ్మకాలు గత నెల నవంబర్‌లో స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది నవంబర్‌లో 3,09,259 యూనిట్లను విక్రయించిన బజాజ్ ఆటో.. ఈ ఏడాది నవంబర్‌లో 3,09,673 యూనిట్లను అమ్మింది. ఇందులో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 3.4 శాతం వృద్ధితో 2,70,886 యూనిట్లుగా ఉన్నాయి. పోయినసారి ఇవి 2,61,948 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక వాణిజ్య వాహనాలు ఈసారి 38,787 యూనిట్లుగా, క్రిందటిసారి 47,311 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతులు 17.14 శాతం పడిపోయి గతంతో పోల్చితే 1,65,733 యూనిట్ల నుంచి 1,37,315 యూనిట్లకు దిగజారాయి.

యాక్సిస్ బ్యాంక్ ‘డిస్‌ప్లే వేరియంట్’ డెబిట్ కార్డు

ముంబయి, డిసెంబర్ 2: దేశీయంగా మూడో అతిపెద్ద ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంక్ దేశంలోనే మొదటిసారిగా ‘డిస్‌ప్లే వేరియంట్’ డెబిట్ కార్డును పరిచయం చేస్తున్నట్లు బుధవారం తెలియజేసింది. ఈ కార్డును హై-వాల్యూ ఎన్‌ఆర్‌ఇ కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చామని, ఎస్‌ఎమ్‌ఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా ఒటిపి కోసం వేచిచూడకుండా ఇంటెర్నెట్ బ్యాంకింగ్ సేవలను పొందేందుకు కస్టమర్లకు ఇది సహకరిస్తుందని ఓ ప్రకటనలో బ్యాంక్ తెలిపింది.