బిజినెస్

తెలుగు రాష్ట్రాల్లో 2 వేల నెట్‌వర్క్ సైట్స్ ఆధునీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు వేల నెట్‌వర్క్ సైట్స్‌ను ఆధునీకరించినట్లు టెలినార్ ఇండియా తెలిపింది. అత్యాధునిక పరికరాలను వినియోగిస్తూ ఈ సర్కిల్‌లోని తమ వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్‌నెట్, వాయిస్‌లో మరింత స్పష్టత అందించడానికి నెట్‌వర్క్ సైట్స్‌ను ఆధునీకరించే కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ శుక్రవారం ఇక్కడ మాట్లాడుతూ సైట్స్‌ను ఆధునీకరించడం వల్ల నెట్‌వర్క్ సామర్థ్యం 25 శాతం పెరిగి అవే స్పెక్ట్రమ్ వనరుల ద్వారా మరింత మెరుగైన జిఎస్‌ఎం సేవల ద్వారా నాణ్యమైన వాయిస్, డేటా సేవలను అందించేందుకు వీలవుతుందని చెప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 5.7 మిలియన్ వినియోగదారులను టెలినార్ కలిగి ఉందన్నారు. కాగా, కొత్త 4జి సాంకేతిక పరిజ్ఞానంతో వారణాసిలో నారో బాండ్ ఎల్‌టిఇని ఉపయోగించి పైలెట్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని తెలిపారు.