బిజినెస్

కొత్త ఆర్థిక సంవత్సరానికి నష్టాలతో స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నూతన ఆర్థిక సంవత్సరాని (2016-17)కి నష్టాలతో స్వాగతం పలికాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల మధ్య బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 72.22 పాయింట్లు కోల్పోయి 25,269.64 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 25.35 పాయింట్లు పడిపోయి 7,713.05 వద్ద నిలిచింది. టెలికామ్, చమురు, గ్యాస్, టెక్నాలజీ, ఎనర్జీ, ఐటి, మెటల్, ఆటో, హెల్త్‌కేర్ రంగాల షేర్ల విలువ 2.40 శాతం నుంచి 0.26 శాతం మేర క్షీణించింది. అయితే రియల్టీ, క్యాపిట్ గూడ్స్, ఎఫ్‌ఎమ్‌సిజి, పవర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్ల విలువ 2.97 శాతం నుంచి 0.70 శాతం పెరిగింది. మిడ్-క్యాప్ సూచీ 0.22 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 0.93 శాతం లాభపడ్డాయి. ఇక ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.79 శాతం నుంచి 3.55 శాతం మధ్య పతనమయ్యాయి. చైనా సూచీ మాత్రం 0.19 శాతం బలపడింది. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు 1.09 శాతం నుంచి 1.59 శాతం వరకు నష్టపోయాయి.
భారీ నష్టాల్లో ఐవిఆర్‌సిఎల్ షేర్లు
కోల్‌కత్తాలో ఫ్లైఓవర్ కూలిపోయిన నేపథ్యంలో ఇన్‌ఫ్రా సంస్థ ఐవిఆర్‌సిఎల్ షేర్ల విలువ శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా పడిపోయింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలిన ఘటనలో 25 మంది దుర్మరణం పాలవగా, దీన్ని హైదరాబాద్‌కు చెందిన ఐవిఆర్‌సిఎల్ నిర్మిస్తున్నది తెలిసిందే. దీంతో ఆ సంస్థ షేర్ల విలువ 12 శాతం వరకు క్షీణించింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో 10.79 శాతం నష్టపోయి ఏడాది కనిష్ట స్థాయిని తాకుతూ 5.70 రూపాయల వద్ద ఉన్న ఐవిఆర్‌సిఎల్ షేర్ విలువ.. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో 11.71 శాతం దిగజారి 52 వారాల కనిష్టాన్ని చేరి 5.70 రూపాయల వద్ద స్థిరపడింది. గురువారం కూడా ఈ సంస్థ షేర్ల విలువ 6 శాతం పడిపోయింది.