బిజినెస్

రాష్ట్ర వౌలికాభివృద్ధిపై చంద్రబాబు దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 8: రాష్ట్రంలో అమరావతితోపాటు ఇతర పట్టణాల్లో వౌలిక సదుపాయాల అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైటర్ రియల్టీ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ఈ మేరకు శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా వివిధ కార్యాలయాల దస్త్రాలు అన్నిటినీ డిజిటల్ రూపంలో సిద్ధం చేసి శాస్ర్తియ విధానంలో భద్రపర్చడం తదితర అంశాలపై చర్చించడం జరిగింది. అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో హోటళ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల ఏర్పాటుకు ముందుకు వస్తే అవసరమైన తోడ్పాటును అందిస్తామని రైటర్ ప్రతినిధులకు సిఎం సూచించారు. ఈ సమావేశంలో ఇంకా ల్యాండ్ స్కేపింగ్ అభివృద్ధి, ఇ-ఔషది వంటి వివిధ అంశాలపైనా చర్చించారు. సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శులు సతీష్ చంద్ర, సాయి ప్రసాద్, మున్సిపల్ పరిపాలన శాఖ సంచాలకులు కన్నబాబు, అర్బన్ గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండి కె చంద్రమోహన్‌రెడ్డి, ప్రజారోగ్య, మున్సిపల్ చీఫ్ ఇంజనీర్ టి మోజెస్‌కుమార్, రైటర్ రియల్టీ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ అధికారి వినాయక బిద్వాయ్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
బ్లూ, గ్రీన్ సిటీగా
కృష్ణానది రివర్ ఫ్రంట్
కృష్ణానది రివర్ ఫ్రంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ప్రకాశం బ్యారేజీ నుండి ఎగువన రాజధాని వైపు 32 కిలోమీటర్ల రివర్ ఫ్రంట్‌ను బ్లూ, గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయాలని, అందుకు అవసరమైన డిజైన్లను రూపొందించాలని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం రాత్రి ముఖ్యమంత్రి తన నివాసంలో అమరావతి రాజధానిపై సమీక్ష జరిపారు. దాదాపు గంట పాటు జరిగిన ఈ సమీక్షలో కృష్ణానది రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసేందుకు కన్సల్టెంట్ సంస్థలకు పలు సూచనలు చేశారు. రివర్ ఫ్రంట్‌ను బ్లూ, గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయడంతోపాటు రివర్ ఫ్రంట్ వెంబడి టూరిజం, వాటర్ స్పోర్ట్స్ ఉండే విధంగా డిజైన్‌లు రూపొందించాలని చెప్పారు. మరో 24 కిలోమీటర్ల పొడవున క్రియేటివ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లు, ఇన్నోవేటివ్ విద్యా సంస్థలు నెలకొల్పే విధంగా డిజైన్ రూపొందించాలన్నారు. కృష్ణానది వెంబడి ఇన్నోవేటివ్ విద్యా సంస్థలు ఏర్పాటు చేయగలిగితే విద్యార్థులకు నది వెంట ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు నిత్యనూతన ఆలోచనలు వచ్చేందుకు దోహదపడుతుందన్నారు. కృష్ణానదిలో ఉన్న భవాని ఐలాండ్స్‌తోపాటు ఎగువన ఉన్న మరో నాలుగు ఐలాండ్స్‌పై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ఐలాండ్‌లలో ఎకో టూరిజంతోపాటు రిసార్ట్స్, ట్రైనింగ్ సెంటర్స్ వచ్చేలా డిజైన్‌లను రూపొందించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న పలు ప్రముఖ కన్సల్టెంట్ సంస్థల ప్రతినిధులు కృష్ణానది రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రికి తమ నమూనాలను అందించారు. అమరావతి రాజధాని సమీక్షకు హాజరైన వారిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఎ, పలు ప్రముఖ కన్సల్టెంట్ సంస్థల ప్రతినిధులు ఉన్నారు.