బిజినెస్

నష్టాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 2: గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాలను నమోదు చేసింది. రూ. 12,300 కోట్ల టర్నోవర్ సాధించినప్పటికీ లాభాలు తగ్గుముఖం పట్టడంతో దాదాపు 14 ఏళ్ల తరువాత సంస్థ నష్టాన్ని చవి చూసింది. చైనా నుంచి చౌక రకం స్టీల్ దేశీయ మార్కెట్‌లోకి దిగుమతి కావడం నష్టాలకు కారణంగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి 2015-16 సంవత్సరంలో అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014- 15) కంటే అమ్మకాలపరంగా 6 శాతం వృద్ధిని కర్మాగారం నమోదు చేసింది. సేలబుల్ స్టీల్ అమ్మకాలు 16 శాతం, స్పెషల్ స్టీల్ అమ్మకాలు 36 శాతం పెరిగాయ. కొత్త స్టీల్ మెల్ట్‌షాపు సామర్థ్యం వినియోగంలో 70 శాతం నమోదైంది. కాగా, 2015-16 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 1,400 కోట్ల మేరకు నష్టాన్ని కర్మాగారం చవిచూసింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని విశాఖ ఉక్కు సిఎండి పి మధుసూదన్ అధికారులతో శనివారం మాట్లాడుతూ ఉక్కు ఉత్పత్తుల అమ్మకాల్లో గణనీయమైన ప్రగతి నమోదు చేశామని తెలిపారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజానాన్ని ఉపయోగించుకుని ఈ ఆర్థిక సంవత్సరంలో సేలబుల్ స్టీల్ ఉత్పత్తి పెంచాల్సి ఉందన్నారు. ఉక్కు మంత్రిత్వ శాఖతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
మరోవైపు రూ. 35 కోట్ల సౌర విద్యుత్ తయారీ యూనిట్ నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల తయారీ, ట్రాన్స్‌మిషన్ లైన్ టవర్ల ప్రాజెక్టుల పూర్తి, వీల్‌ప్లాంట్, కోక్-ఓవెన్ బ్యాటరీ-5 నిర్మాణం ప్రాధాన్యతగా గుర్తించామని సిఎండి తెలియజేశారు.