బిజినెస్

హిందుస్థాన్ షిప్‌యార్డు దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 22: హిందుస్థాన్ షిప్‌యార్డును భారత నౌకాదళం విలీనం చేసుకున్న తరువాత షిప్‌యార్డు కార్యకలాపాలు పెరిగాయి. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డింగ్ లిమిటెడ్‌లో ఇప్పటివరకూ భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలను నిర్మించారు. నాడు తూర్పు నౌకాదళానికి అత్యంత చేరువలో ఉన్న హిందుస్థాన్ షిప్‌యార్డు నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఒక దశలో దీన్ని మూసివేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇదే సమయంలో భారత నౌకాదళం భారీ ఎత్తున యుద్ధ నౌకలను నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇటువంటి సమయంలోనే హిందుస్థాన్ షిప్‌యార్డును భారత నౌకాదళం విలీనం చేసుకుంది. అయతే ఇటీవల కాలంలో హిందుస్థాన్ షిప్‌యార్డుకు నేవీ ఆర్డర్స్ ఇస్తూ వస్తోంది. ఇందులో భాగంగా రెండు ఇన్‌షోర్ పెట్రోల్ వెసల్స్ తయారు చేసే బాధ్యతను హిందుస్థాన్ షిప్‌యార్డుకు ఇచ్చింది. ఇందులో నాలుగు వెసల్స్‌ను ఇప్పటికే షిప్‌యార్డు నిర్మించి కోస్ట్‌గార్డ్‌కు అందచేసింది. మూడు రోజుల కిందట నాలుగో ఇన్‌షోర్ పెట్రోల్ వెసల్ రాణి గైడిల్యుని కోస్ట్‌గార్డు డిజి రాజేంద్ర సింగ్ జలప్రవేశం చేయించారు. మరో ఇన్‌షోర్ పెట్రోల్ వెసల్ రాణి రష్మోణి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇది వచ్చే ఏడాది మే నాటికి కోస్ట్‌గార్డుకు అందుబాటులోకి రానుంది. కోస్ట్‌గార్డ్ అందిస్తున్న సహకారానికి షిప్‌యార్డు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శరత్‌బాబు ఇప్పటికే ధన్యవాదాలు తెలియచేశారు. గడచిన తొమ్మిది నెలల్లో షిప్‌యార్డు కొత్త ఆలోచనలతో పనిచేస్తోందని, నాణ్యమైన ఉత్పత్తులను భారత నౌకాదళానికి, కోస్ట్‌గార్డుకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని శరత్ బాబు చెప్పారు. ఇప్పటికే నేవీకి రెండు టగ్స్, ఒక ఇన్‌షోర్ పెట్రోల్ వెసల్‌ను అందించిన హిందుస్థాన్ షిప్‌యార్డు.. 25 టన్నుల బొలార్డ్ పుల్ టగ్‌ను నేవీ కోసం సిద్ధం చేసింది. ఇది డెలివరీకి సిద్ధంగా ఉంది. అలాగే కెపిటి కోసం తయారు చేసిన 50 టన్నుల బొలార్డ్ పుల్ టగ్‌ను ఈ నెలాఖరుకు డెలివరీ చేయనుంది. ఒకే ఏడాది ఇన్ని వెసల్స్‌ను నిర్మించి, డెలివరీ చేయడం భారత నౌకా నిర్మాణ పరిశ్రమలో ఒక రికార్డు అని శరత్ బాబు చెబుతున్నారు.