బిజినెస్

పడుతూ.. లేస్తూ.. పయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 2: వరుస లాభాల్లో కదలాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు గడచిన వారం బ్రేక్ పడింది. నాలుగు వారాలుగా సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించగా, గత వారం మాత్రం అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. అయితే స్వల్ప నష్టాలకే పరిమితమవగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 67.92 పాయింట్లు పడిపోయి 25,269.64 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 3.45 పాయింట్లు కోల్పోయి 7,713.05 వద్ద నిలిచింది. నాలుగు రోజుల వరుస సెలవుల అనంతరం గడచిన వారం ట్రేడింగ్‌లో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. మార్చి నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండటం, వడ్డీరేట్లపై అమెరికా రిజర్వ్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లెన్ మాట్లాడుతుండటం మదుపరులలో భయాలను నింపింది. దీనివల్ల సోమవారం సెనె్సక్స్ 371, నిఫ్టీ 101 పాయింట్ల మేర క్షీణించాయి. మంగళవారం సైతం ఇదే ధోరణి మధ్య సెనె్సక్స్ 66, నిఫ్టీ 18 పాయింట్లు పడిపోగా, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నడుమ ఇప్పుడు వడ్డీరేట్లను పెంచడం సరికాదని ఫెడ్ రిజర్వ్ చైర్‌పర్సన్ భావించడం బుధవారం మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. ఫలితంగా సెనె్సక్స్ 438 పాయింట్లు, నిఫ్టీ 138 పాయింట్లు ఎగిశాయి. గురువారం స్పల్ప లాభాల్లో ముగిసిన సూచీలు.. శుక్రవారం మళ్లీ నష్టాలతోనే సరిపెట్టాయి. సెనె్సక్స్ 72, నిఫ్టీ 25 పాయింట్లు దిగజారాయి. ఇక హెల్త్‌కేర్, మెటల్, టెక్నాలజీ, ఐటి, చమురు, గ్యాస్ రంగాల షేర్ల విలువ 2.19 శాతం నుంచి 0.14 శాతం పడిపోయాయి. అయితే రియల్టీ, విద్యుత్, ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్ల విలువ 2.74 శాతం నుంచి 0.16 శాతం పెరిగాయి. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 13,792.46 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 96,668.10 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 9,153.54 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 49,672.25 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. కాగా, వరుసగా నాలుగు వారాల్లో సెనె్సక్స్ 2,183.26 పాయింట్లు ఎగబాకితే, నిఫ్టీ ఈ నాలుగు వారాల్లోనే 686.75 పాయింట్లు ఎగిసింది.