బిజినెస్

సుజ్లాన్ గ్రూప్ సిఇఒగా జెపి చలసాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: సుజ్లాన్ గ్రూప్ సిఇఒగా జెపి చలసాని నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆ సంస్థ ప్రకటించింది. ‘గ్రూప్ సిఇఒగా సుజ్లాన్ కుటుంబంలోకి జెపి చలసాని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మెకానికల్ ఇంజినీర్‌కున్న అనుభవం సంస్థ పురోగతికి ఎంతగానో దోహదపడుతుంది.’ అని సుజ్లాన్ గ్రూప్ చైర్మన్ తులసి తంతి ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఎన్‌టిపిసితో మొదలైన చలసాని ప్రయాణం.. రిలయన్స్ పవర్ వరకు సాగింది. ఇక చలసాని మాట్లాడుతూ సుజ్లాన్‌ను దగ్గరగా చూస్తున్నానని, వ్యాపార కార్యకలాపాల్లో సుజ్లాన్ మేటి అని అన్నారు.

ప్రమాద సంకేతాలను పెద్దగా ముద్రించం: ఐటిసి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: సిగరెట్ ప్యాకెట్లపై ప్రమాద సంకేతాన్ని పెద్దగా వేయడానికి తాము సిద్ధంగాలేమని ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం ఐటిసి శనివారం స్పష్టం చేసింది. సిగరెట్ ప్యాకెట్లపై 85 శాతం భాగాన్ని ప్రమాద సంకేతాలకే కేటాయించాలన్న నిబంధనను శుక్రవారం నుంచి ప్రభుత్వం అమల్లోకి తెచ్చినది తెలిసిందే. అయితే ఇందుకు ససేమిరా అంటున్న ఐటిసి, గాడ్‌ఫ్రే ఫిలిప్స్, విఎస్‌టి తదితర సిగరెట్ ఉత్పాదక సంస్థలు ఈ విషయంపై స్పష్టత వచ్చేదాకా తమ కర్మాగారాలను మూసివేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే.