బిజినెస్

శ్రీసిటీలో వసతులు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ/సత్యవేడు, అక్టోబర్ 27: జపాన్‌లోని టొయామో స్టేట్‌కు చెందిన 15 మంది అత్యున్నత శ్రేణి ప్రతినిధుల బృందం గురువారం శ్రీసిటి సెజ్‌ను సందర్శించింది. టొయామో స్టేట్ గవర్నమెంట్ అర్బన్ కమర్షియల్ డెవలప్‌మెంట్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఒహోషి యుటాకా నేతృత్వంలో విచ్చేసిన వీరికి శ్రీసిటి అధ్యక్షులు సతీష్ కామత్ సాదరంగా స్వాగతం పలికి ఇక్కడ వౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతిని వివరించారు. పర్యటన అనంతరం ఒహోషి యుటాకా మాట్లాడుతూ శ్రీసిటిలో ప్రపంచశ్రేణి వౌలిక వసతులు, స్నేహపూర్వక వ్యాపార వాతావరణం తమను ఎంతగానో ఆకర్షించిందన్నారు. ఇంతటి భారీ పారిశ్రామిక పార్కును ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న శ్రీసిటి యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. రాష్ట్ర రాజాధాని అమరావతితో పాటు శ్రీసిటి సందర్శించిన జపాన్ బృందానికి ఎండి రవీంద్ర సన్నారెడ్డి అభినందనలు తెలిపారు. టొయామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పలు అంశాల్లో పోలికలు ఉన్నాయన్నారు. మంచి ప్రదేశం, ప్రకృతి వనరులు, మిగులు విద్యుత్తు, కష్టపడి పనిచేసే ప్రజలు ఇలా పలు అంశాల్లో పోలికలు ఉందన్నారు. వీరి పర్యటనతో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత మెరుగుపడడమే కాకుండా మరిన్ని పరిశ్రమలు ఏర్పాటుకు మంచి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ పర్యటనలో భాగంగా శ్రీసిటిలోని జపాన్ దేశానికి చెందిన ఆటోమొబైల్ పరిశ్రమ వయోలాక్స్‌ను సందర్శించారు. ఈ బృందంలో జెట్రో అధికారులతో పాటు బొయామోకు ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులు పలువురు ఉన్నారు.

చిత్రం.. శ్రీసిటీని సందర్శించిన జపాన్ ప్రతినిధుల బృందం