బిజినెస్

పెట్టుబడుల ఉపసంహరణకు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ప్రభుత్వ రంగంలోని డజను పైగా సంస్థల్లో (పిఎస్‌యుల్లో) పెట్టుబడుల ఉపసంహరణకు నీతి ఆయోగ్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి వర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వీటిలో లాభాలను ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. పెట్టుబడులను ఉపసంహరించే ప్రభుత్వ రంగ సంస్థల పేర్లను వాటిలోని వాటాలను వేలానికి పెట్టినప్పుడు వెల్లడించడం జరుగుతుందని జైట్లీ చెప్పారు. ‘ప్రభుత్వ రంగ సంస్థల్లోని పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల అమ్మకానికి సంబంధించి నీతి ఆయోగ్ చేసిన సిఫారసులపై మంత్రివర్గ సమావేశంలో పరిశీలన జరిగింది. వీటిలో కొన్ని యూనిట్లకు సంబంధించిన సిఫారసులను మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది’ అని జైట్లీ స్పష్టం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ విభాగంతో పాటు సంబంధిత మంత్రిత్వ శాఖలు ఈ ప్రక్రియను పరిశీలించిన తర్వాత ప్రతి కేసునూ విడివిడిగా పరిశీలించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ‘నీతి ఆయోగ్ సిఫారసులను మంత్రి మండలి సూత్రప్రాయంగా ఆమోదించింది. ఈ సిఫారసులకు అనుగుణంగా పిఎస్‌యుల్లో పెట్టుబడుల ఉపసంహరణ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రతి కేసునూ విడివిడిగా పరిశీలించడం జరుగుతుంది. ప్రభుత్వ రంగంలోని ఏఏ సంస్థల నుంచి వాటాలను విక్రయించేదీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత వెల్లడించడం జరుగుతుంది. మూసివేత దిశగా సాగుతున్న పిఎస్‌యులను ఈ జాబితాలో చేర్చలేదు’ అని జైట్లీ పేర్కొన్నారు.
అయితే ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత కొన్ని సంస్థల్లో ప్రభుత్వ వాటాలు 50 శాతం కంటే తగ్గనుండటంతో ఆయ సంస్థల యాజమాన్య హక్కులు ఇతరులకు బదిలీ అవుతాయి. పెట్టుబడులు ఉపసంహరించాలని ప్రతిపాదించిన ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని ముఖ్యమైన యూనిట్లు (సంస్థలు) ఉన్నాయని, కనుక ప్రతి యూనిట్ శక్తిసామర్ధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిలోని వాటాలను ఎప్పుడు అమ్మాలన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని జైట్లీ వివరించారు. వాటాలను విక్రయించే ప్రభుత్వ రంగ సంస్థల స్థిరాస్తులతో పాటు ఇతర ఆస్తులను గమనంలోకి తీసుకుని ఆయా సంస్థల విలువ మదింపు చేయడం జరుగుతుందని, ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శకమైన పద్ధతిని అనుసరిస్తుందని ఆయన చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పిఎస్‌యుల నుంచి వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా రూ.20,500 కోట్లను రాబట్టుకోవాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుంటుందా? అని విలేఖరులు ప్రశ్నించగా, ప్రస్తుతం మనం ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉన్నామని, పిఎస్‌యుల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించిందని జైట్లీ అన్నారు. పిఎస్‌యు షేర్ల బైబ్యాక్, ఓఎఫ్‌ఎస్ (ఆఫర్ ఫర్ సేల్) ద్వారా ఇప్పటికే 8 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు రాబట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద పిఎస్‌యుల నుంచి మైనార్టీ వాటాలను అమ్మడం ద్వారా రూ.36 వేల కోట్లు రాబట్టుకోవాలని భావిస్తోంది.
చక్కెర నిల్వ పరిమితి
ఆరు నెలలు పొడిగింపు
ఇదిలావుంటే, దేశంలో చక్కెర నిల్వకు సంబంధించి వర్తకులకు విధించిన పరిమితిని మరో ఆరు నెలలు (వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు) పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్లో ప్రస్తుతం కిలో 40 రూపాయల వరకు చేరుకున్న చక్కెర ధరను అదుపు చేయాలన్న ధ్యేయంతో గురువారం మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న అరుణ్ జైట్లీ