బిజినెస్

అమెరికాలో మాల్యాకు పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 3: భారత్‌లో విజయ్ మాల్యాకు చెందన యుబి గ్రూపు భారీ మొత్తంలో రుణాల ఎగవేత ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్పటికీ అమెరికాలోని యునైటెడ్ బ్రూవరీస్‌కు చెందిన అనుబంధ సంస్థ ఒకటి సంక్లిష్టమైన రీతిలో నిధులను సమకూర్చుకోగలిగింది. ఈ రుణ మొత్తాన్ని ఆ కంపెనీ భారత్‌లోన తన మాతృసంస్థనుంచి తీసుకునే బ్రిడ్జి లోన్ ద్వారా తీరుస్తామని ఆ కంపెనీ తెలియజేయడం గమనార్హం. అమెరకాలో కింగ్‌ఫిషర్ బీరుతో పాటుగా రకరకాల బీరు బ్రాండ్లను విక్రయించే కాలిఫోర్నియాకు చెందిన మెండోసనో బ్రూయంగ్ కంపెనీ అంత్యం సంక్లిష్టమైన షేర్ హోల్డింగ్ ద్వారా మాల్యాను తన చైర్మన్‌గా ఎంపిక చేసుకోగలగడమే కాకుండా యుబి గ్రూపునకు చెందిన కంపెనీగా మారిపోయంది. అమెరికా మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెక్యూరిటీస్, ఎక్స్‌చేంజి కమిషన్ (ఎస్‌ఇబి)కి దాఖలు చేసిన ఒక ప్రకటనలో మెండోసినో ఈ విషయం తెలియజేసింది. డెలవారేకి చెందిన కాటమారన్ సర్వీసెస్‌కు అసలు మొత్తం కింద 3,25,00 డాలర్లు (సుమారు 2 కోట్ల రూపాయల) విలువైన ఒక ప్రామిసరీ నోట్‌ను జారీ చేసినట్లు తెలిపిన కంపెనీ ఇంతకు ముందు కూడా 5 లక్షల డాలర్ల అసలు మొత్తానికి నాలుగు ప్రామిసరీ నోట్లను జారీ చేసినట్లు తెలిపింది.
కాటమారన్ ఏకైక వాటాదారు కాటమారన్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే పేరు గల సంస్థ. దాని డైరెక్టర్లు, మెండోసనో ప్రధాన వాటాదారుల్లో ఒకటైన మిరాబెల్ ఎస్‌ఏ డైరెక్టర్లూ ఒకటే కావడం గమనార్హం. దీనితో పరోక్షంగా యుబిహెచ్‌ఎల్ ఆ కంపెనీలో మేజర్ వాటాదారుగా మారడమే కాకుండా మాల్యా దాని డైరెక్టర్ల బోర్డు చైర్మన్‌కూడా అవుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ‘స్టాండప్ ఇండియా’
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: దేశంలో షెడ్యూల్డు కులాలు, తెగలతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘స్టాండప్ ఇండియా’ పేరుతో ఈ నెల 5వ తేదీన సరికొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద వారికి బ్యాంకులు పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలను అందజేస్తాయి. మంగళవారం నోయిడాలో జరిగే కార్యక్రమంలో ‘స్టాండప్ ఇండియా’ పథకంతో పాటు ఆ పథకానికి సంబంధించిన వెబ్ పోర్టల్‌ను కూడా ప్రధాని ప్రారంభిస్తారని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ఆ శాఖ సహాయ మంత్రి, సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి, ఉత్తరప్రదేశ్ గవర్నర్ తదితరులు హాజరుకానున్నారు.