బిజినెస్

పవన విద్యుత్ ఉత్పత్తికి తొలి అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 4: తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న మెదక్ జిల్లాలో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుతో ఇబ్బందులు తొలగిపోగా తాజాగా పవన విద్యుత్ ఉత్పత్తికి అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో జహీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న నిమ్జ్ ఆధ్వర్యంలో స్థాపితం కానున్న వివిధ పరిశ్రమలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడానికి కొత్త పుంతలు తొక్కనున్నారు. మొత్తం 14 గ్రామాలకు చెందిన 12 వేల పైచీలుకు భూమిని సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. మొదటి విడతగా 3500 ఎకరాల భూ సేకరణ లక్ష్యంగా పెట్టుకుని 90 శాతం సేకరణ పూర్తి చేసారు. ఝరాసంగం మండల పరిధిలోని చీలపల్లి గ్రామ శివారులో మూడు పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు పనులను ప్రారంభించారు. మూడు పవన విద్యుత్ ప్లాంట్ల ద్వారా ఒక పరిశ్రమకు సరిపోను విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. చీలపల్లి గ్రామ శివారులోని భూమి ఎత్తు ప్రదేశంలో ఉండటంతో కుప్పానగర్, ఎల్గొయి, చీలపల్లి గ్రామ శివారుల్లో ఈ పనులను ప్రారంభించారు. పవన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన పరికరాలను తరలించారు. 125 మీటర్ల ఎత్తులో గాలి మరలను ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలో ఇలాంటి ప్రయోగం మొదటి సారి చేపట్టనుండటంతో జహీరాబాద్ ప్రాంతంలో ఆకర్షణీయంగా మారనుంది. ఫ్యాన్లను తలపించే విధంగా పవన విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాటు చేసే గాలి మరలు అందరిని ఆకట్టుకోనున్నాయి. న్యాల్‌కల్ మండలంలోని మామిడ్గి శివారు కూడా ఎత్తు ప్రదేశంలో ఉండటంతో అక్కడ కూడా పవన విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం కనిపిస్తోంది. చీలపల్లి గ్రామ శివారులో మొత్తం పది విద్యుత్ ప్లాంటు నిర్మించాలని యోచించిన అధికారులు మూడింటికి మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తోంది. సుజలోన్ అనే ప్రైవేట్ సంస్థ ఈ పనులను నిర్వహిస్తోంది. రెండు, మూడు నెలల్లో పనులు పూర్తి చేసి పవన్ విద్యుత్ ఉత్పత్తిని సాధించాలనే యోచనలో శరవేగంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే పవన విద్యుత్ ఉత్పత్తి మొట్ట మొదటి సారిగా మెదక్ జిల్లాలో చేపట్టడం గమనార్హం.

చిత్రం గాలి మరల ఏర్పాటు కోసం సిద్ధం చేసిన పరికరాలు