బిజినెస్

చేదెక్కిన బెల్లం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఏప్రిల్ 4: మార్కెట్‌కు బెల్లం ధర క్రమంగా పెరుగుతోంది. డిమాండ్ పెరగడంతో ధర సైతం పెరిగిపోయింది. ఈ సీజన్‌లో ఎన్నడూ లేని విధంగా పది కిలోల మంచి రంగు బెల్లం ధర రూ. 345 పలుకుతోంది. నాసిరకం నలుపురంగు బెల్లం ధర సైతం రూ.240 నుండి రూ.280 పలుకుతోంది. పెరుగుతున్న పంచదార ధరల ప్రభావం బెల్లంపై పడడంతో ధర పెరిగినట్లు తెలుస్తోంది. మామూలుగా ఉగాది, శ్రీరామనవమి లాంటి పర్వదినాల్లో బెల్లం ధరలు పెరుగుతుంటాయి. అయితే అందుకు పూర్తివిరుద్దంగా ఈ సీజన్‌లో అనూహ్యంగా ధర పెరిగింది. ఈ ఏడాది మార్కెట్ సీజన్ ప్రారంభం నుండి మంచి రంగు బెల్లం ధర రూ.250కి మించి పలకలేదు. అయితే ప్రస్తుతం నాసిరకం బెల్లానికి ఆ ధర లభిస్తోంది. నిన్నటి వరకు క్వింటాలు పంచదార ధర రూ.3 వేల నుంచి రూ. 3,400 ఉండేది. అయితే ఒకేసారి ధర రూ.4 వేలకు చేరుకుంది. దీంతో బెల్లం ధరలు కూడా పెరిగాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోన్ని మార్కెట్లకు వచ్చే బెల్లం తగ్గిపోతుంది. దీంతో బెల్లం కొరత ఏర్పడటంతో ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అనకాపల్లి మార్కెట్‌కు రోజుకు 20 వేల దిమ్మల బెల్లం వస్తోంది. మామూలుగా మే వరకు మార్కెట్ సీజన్ ఉండేది. కానీ ఈ ఏడాది మరో పక్షం రోజుల వరకు మాత్రమే సీజన్ ఉంటుంది. ప్రస్తుతం అనకాపల్లి మార్కెట్ నుండి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు బెల్లం ఎగుమతి జరుగుతోంది. సీజన్ ముగిసే తరుణంలో బెల్లానికి మంచి ధర పలుకుతుండటంతో చెరుకు రైతులు ఊరటచెందుతున్నారు.