బిజినెస్

ఆహార శుద్ధి పరిశ్రమలతో రైతులకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 4: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా రైతుల ఉత్పత్తులకు విలువ జోడించే ‘వాల్యూ ఎడిషన్’ విధానంలో అత్యుత్తమ ధరలు, మార్కెట్ గ్యారంటీ కల్పించేందుకు విస్తృత చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సిఇవో వైఎస్ ప్రసాద్ తెలిపారు. సోమవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంట కోతల అనంతరం మార్కెటింగ్, రవాణా, శీతలీకరణ, గోదాములు, ఆపై లాభసాటి ధర వంటి సదుపాయాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆహార శుద్ధి పాలసీని ప్రకటించిందన్నారు. ఈ విధానంలో ప్రతి జిల్లాలో ఒక ఇంటిగ్రేటెడ్ ఫుడ్‌పార్క్, శీతలీకరణ గోదాములు ఏర్పాటు చేసేందుకు ఇప్పటివరకు తమ శాఖకు రూ.3వేల 500 కోట్ల విలువైన 65 ప్రతిపాదనలు అందగా వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. ఒక్కో మెగా ఫుడ్‌పార్క్‌కు కనీసం 20 యూనిట్లు ఏర్పాటు చేయాల్సి వుందని, ఇందుకు రూ.110 కోట్లు పెట్టుబడిగా సమకూర్చుకోవాల్సి వుందన్నారు. అయితే అర్హతలున్న సంస్థలు ముందుకొస్తే ప్రభుత్వం రూ.50 కోట్ల మేర గ్రాంట్ విడుదల చేస్తుందని తెలిపారు. మెగా ఫుడ్‌పార్క్ కోసం ఈ నెలాఖరు లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులకు మంచి ధర అందించడంతో పాటు ముందుగానే నిశ్చయమైన మార్కెట్లు రైతులకు మంచి ధర కల్పించడం వంటి పనులను సమన్వయపరిచేందుకు ‘మెగా ఫుడ్ పార్కులు’ దోహదపడతాయని ప్రసాద్ అన్నారు. ఈ వ్యవస్థకు రైతులను అనుసంధానించేందుకు వీలుగా రైతు ఉత్పత్తుల సంస్థ (్ఫర్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ల)ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఒక లక్ష మంది రైతులు సభ్యులుగా వుండేలా 10వేల ‘్ఫర్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్’ల ఏర్పాటు దాదాపు పూర్తికావొచ్చిందన్నారు. వీటిని అనంతపురం జిల్లా నుంచి ఈ నెల 15-20 తేదీల మధ్య ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. మెగా ఫుడ్‌పార్కుల్లోని ఆహార పంటల పరిశ్రమల ప్రతినిధులకు, రైతులకు మధ్య ఒక సమన్వయ పద్ధతిలో పంట ఉత్పత్తులు ఎగుమతులకు అవసరమైన ప్రమాణాలతో పండించేలా చర్యలు చేపట్టడం ఆహార శుద్ధి విధానంలో ప్రత్యేకతగా తెలిపారు. ఇప్పటికే మన రాష్ట్ర ఉత్పత్తులకు విదేశాల్లో మంచి గిరాకీ ఉందన్నారు. అంతర్జాతీయంగా ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు 170 రకాలైన అనుమతులు అవసరమన్నారు. ప్రధానంగా ఆక్వా ఉత్పత్తులు ఈ అనుమతులన్నీ సాధించి అంతర్జాతీయ విపణిలో అడుగుపెట్టడంలో విజయం సాధించామన్నారు. ఈ విజయాన్ని ఇతర ఆహార ఉత్పత్తులకు వర్తింపచేయడమే నూతన ఆహార శుద్ధి పరిశ్రమ విధానమని ఆయన పేర్కొన్నారు. కర్నూలు, కడప జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో అరటి పంట అత్యధిక దిగుబడులు సాధిస్తోందన్నారు. ఇందుకోసం కర్నూలులో మెగా ఫుడ్‌పార్క్ ఏర్పాటు కాబోతోందన్నారు. దీనివల్ల అరటి రైతులకు అద్భుతమైన లాభాలు లభించనున్నాయన్నారు. అరకులో గిరిజనులు పండిస్తున్న ‘అరబిక్ కాఫీ’, గుంటూరు జిల్లాలోని మిర్చి వంటి పంటలకున్న ప్రపంచవ్యాప్త ఆదరణను రైతులకు ప్రయోజనకరంగా మార్చేందుకు ఆహార శుద్ధి పాలసీ ప్రత్యేక సదుపాయాలు కలిగిన ఫుడ్ పార్క్‌లను ఏర్పాటు చేయనుందన్నారు. చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మత్స్య ఉత్పత్తుల ఆహార శుద్ధిచేసే పరిశ్రమలకు ప్రతి జిల్లాలో ‘ఇంక్యుబేటర్’లు ఏర్పాటు చేయనున్నామన్నారు. విదేశీ ఎగుమతులకు వీలుగా పండ్లు, కూరగాయలను న్యూక్లియర్ కిరణాల ద్వారా ‘బాక్టీరియా’ రహితంగా మార్చే ప్రయోగశాలను ముంబైకి చెందిన ఒక సంస్థ విశాఖ లేదా చిత్తూరు జిల్లాల్లో ఏర్పాటు చేయనుందన్నారు. పశ్చిమ దేశాలు, అమెరికాకు పండ్లు ఎగుమతి చేయడం ఈ శుద్ధి తర్వాత గణనీయంగా పెరుగుతుందన్నారు. విదేశాలకు ఎగుమతి చేసే పండ్లు, కూరగాయలు, ఆక్వా, ఇతర రకాల ఆహార ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వున్నదీ, లేనిదీ పరీక్షించి ధ్రువీకరించేందుకు ప్రయోగశాలలు రాష్ట్రంలో స్థాపిస్తామన్నారు. ఆక్వా ఉత్పత్తుల పరీక్షలకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రయోగశాల ఏర్పాటవుతోందన్నారు. విమ్టా కంపెనీ విశాఖ, నెల్లూరు జిల్లాల్లో వివిధ ఆహార ఉత్పత్తుల పరీక్షలకు ప్రయోగశాలల ఏర్పాటుకు ముందుకొచ్చిందన్నారు. అనంతపురం, విజయనగరం జిల్లాల్లో రెండు చొప్పున నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలో ఒక్కోటి చొప్పున మెగా ఫుడ్‌పార్క్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయన్నారు. అదేవిధంగా పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు చెందిన మెగా పార్క్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ను కోరామన్నారు. ఆహార శుద్ధి రంగంలో భాగంగా పంట ఉత్పత్తి అనంతరం సదుపాయాలైన రవాణా, గిడ్డంగులు, శీతలీకరణ గిడ్డంగుల నిర్మాణానికి జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ రూ.500 కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని ప్రసాద్ వివరించారు.