తెలంగాణ

ప్రాజెక్టులకు కాదు, దోపిడీకి వ్యతిరేకం: భట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: తెలంగాణ సర్కారు సుమారు 42వేల కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ప్రాజెక్టుల పేరిట జరుగుతున్న నిధుల స్వాహాపై సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, నిధుల దోపిడీకి తాము అంగీకరించమన్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. 2013లో యుపిఎ సర్కారు తీసుకొచ్చిన చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి, రైతులను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ఇందుకోసం తమ పార్టీ రైతుల తరఫున పోరాడుతుందన్నారు.