విజయనగరం

కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్న బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని విమర్శ
విజయనగరం : కేంద్రాల నిర్వహణకు డబుబ్బలు ఇవ్వరు, జీతాల బకాయిలు విడుదల చేయకుండా ఏ విధంగా అంగన్‌వాడీలు ఎదురు డబ్బులు చేతినుంచి పెట్టుకుని పనిచేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాన్ని 7100కు పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయమని అడుగుతుంటే నిర్బంధాలు ఎందుకుని నిలదీసారు. పేదల, ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనపడవని, ఆయనకు బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్లు మాత్రమే కనిపిస్తారని విమర్శించారు. ఎంతకాలం ఓపిక వహించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించే వరకు అంగన్‌వాడీల పోరాటానికి అండగా ఉంటామని చెప్పారు. సిఐటియు జిల్లా కార్యదర్శి టివి రమణ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పెంచిన జీతాలకు జిఓ విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఈ దశలో కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలంటూ సిఐటియు, సిపిఎం నాయకులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో పోలీసులకు, ప్రజాసంఘాల నాయకులకు మధ్య తోపులాట జరిగింది. కొద్దిసేపు ఏం జరుగుతుందోననే గందరగోళం అక్కడ నెలకొంది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజాసంఘాల వ్యూహాన్ని పసిగట్టిన పోలీసు అధికారులు సిపిఎం, సిఐటియు నాయకులను ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుని కలెక్టరేట్ లోపలికి తరలించారు. వారిని వ్యాన్‌లోకి ఎక్కించి బయటకు తరలించే క్రమంలో అంగన్‌వాడీలకు, పోలీసు సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నాయకులను తరలిస్తున్న పోలీసు వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుని తరలింపును ప్రతిఘటించారు. రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అయినా పోలీసులు రోప్ పార్టీముందు మహిళా కానిస్టేబుళ్లను మొహరించి అరెస్ట్‌చేసిన నాయకులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ దశలో నాలుగుగంటల పాటు కొనసాగిన ఆందోళనను అంగన్‌వాడీ కార్యకర్తలు జాయింట్ కలెక్టర్ రామారావు ఇచ్చిన హామీతో విరమించారు. బకాయిలను డిసెంబర్ 10వతేదీలోగా విడుదల చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఇందుకు నిధులు మంజూరు అయినట్లు మహిళాశిశు సంక్షేమ శాఖ డైరక్టర్ తెలిపారని అంగన్ వాడీ నాయకులకు తెలిపారు. ఇతర సమస్యలు అధికారులు, నాయకులతో చర్చించి పరిష్కరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు.