Others

ఇంతి చదువే ఇంటికి వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12 ఏళ్ల వయస్సులోనే తన చేతికున్న గాజులను ధారాళంగా విరాళంగా ఇచ్చిన చిన్నారి దుర్గాబాయ్ దేశ్‌ముఖ్. తన పదయేటనే హిందీపై పట్టు సాధించి హిందీ పాఠశాలను నెలకొల్పి వయోభేదం పాటించకుండా అందరికీ హిందీని నేర్పించిన ధీశాలి దుర్గాబాయి. కృష్ణవేణమ్మ, రామారావులకు ముద్దుబిడ్డయై 1909 జూలై 15న కళ్లు తెరిచిన ఈ చిన్నారి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వనితామణిగా ప్రసిద్ధికెక్కింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటును పొందింది. 1975లో మన ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చి ఈమెను సత్కరించింది. నెహ్రూ లిటరసీ అవార్డు, యునెస్కో నుంచి ఫాల్‌జి హఫ్‌మన్ అవార్డు దుర్గాబాయిని వరించాయి. ఎం.ఏ. పొలిటికల్ సైన్సులో ఉన్నత విద్యను అభ్యసించిన ఈమె ఎల్‌ఎల్‌బిలోకూడా ఉత్తీర్ణతనుపొందారు. దేశఉన్నతికోసం ప్రజల్లో చైతన్యం తేవడానికి ఆమెజీవిత పర్యంతమూ కృషి చేశారు.