లండన్‌కు భరత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఖైరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేయనుంది. శ్రీమంతుడు తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ను లండన్‌లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరిస్తారట. మార్చి మొదటివారంలో యూనిట్ లండన్ బయలుదేరనుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని, దేవిశ్రీ సంగీతం అందిస్తున్న పాటలను మార్చి చివరి వారంలో విడుదల చేస్తారట. డి.వి.వి. క్రియేషన్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో శరత్‌కుమార్, ప్రకాష్‌రాజ్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తుండగా, మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు.