రాష్ట్రీయం

చట్టాలను కఠినతరం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 23: అవినీతికి పాల్పడుతున్న అధికారులకు శిక్షలు పడటంలో చోటుచేసుకుంటున్న జాప్యం కారణంగా ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సివిసి) కెవి చౌదరి అభిప్రాయపడ్డారు. విశాఖ ఎయులోని వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో శనివారం ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ అండ్ ప్రోబిటీ ఇన్ పబ్లిక్ లైఫ్ అంశంపై విద్యార్థులతో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. అవినీతికి పాల్పడుతున్న వారు ఎంతటి వారయినా సరే శిక్షకు అర్హులన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా అవినీతికి పాల్పడితే శిక్ష తప్పదనే భయం ఉద్యోగుల్లో కలిగించాలన్నారు. అవినీతికి పాల్పడిన అధికారులపై విచారణ నిర్వహించి 15నెలల కాలంలోనే వారిపై చర్యలు తీసుకునే విధంగా చట్టానికి సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి పరులపై కఠిన చర్యలు తీసుకున్న విధంగానే, అవినీతిపై పోరాడుతున్న వారిపై దాడులకు పాల్పడుతున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సివిసి) ఆధ్వర్యంలో అవినీతి నిరోధంపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నగరంలోని ఆంధ్రామెడికల్ కళాశాల, ఐఐఎం, గీతం, ఎయు, అనిట్స్, పైడా తదితర కళాశాలలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులతో సివిసి కెవి చౌదరి ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమానికి ఆదాయపుపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ సురేష్‌బాబు సారథ్యం వహించగా, ఎయు విసి ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు, ఆదాయపన్ను ప్రిన్సిపల్ కమిషనర్ విశాఖ 1 బిజి రెడ్డి, ప్రిన్సిపల్ కమిషనర్ విశాఖ 2 సిహెచ్ ఓంకారేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.