క్రీడాభూమి

క్రికెట్‌కు చందర్‌పాల్ సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ జాన్స్, జనవరి 23: వెస్టిండీస్ వెటరన్ ఆటగాడు శివనారైన్ చందర్‌పాల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించాడు. 41 ఏళ్ల చందర్‌పాల్ 22 ఏళ్ల కెరీర్‌లో 164 టెస్టులు ఆడాడు. 280 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి 11,867 పరుగులు సాధించాడు. విండీస్ తరఫున ఇది రెండో అత్యధిక స్కోరు. బ్రియాన్ లారా 11,953 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, ప్రపంచ టెస్టు చరిత్రలో అత్యధిక స్కోర్లు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో చందర్‌పాల్ ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 203 (నాటౌట్). ఇదే స్కోరును అతను రెండు సార్లు సాధించడం గమనార్హం. మొదటిసారి 2005లో దక్షిణాఫ్రికాపై జార్జిటౌన్‌లో అతను అజేయంగా 203 పరుగులు సాధించాడు. తిరిగి 1012లో బంగ్లాదేశ్‌తో మీర్పూర్‌లో జరిగిన టెస్టులో అదే ఫీట్‌ను పునరావృతం చేశాడు. కాగా, 30 శతకాలు, 66 అర్ధ శతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. అదే విధంగా కెరీర్‌లో 268 వనే్డలు (251 ఇన్నింగ్స్) ఆడిన చందర్‌పాల్ 8,778 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 150 పరుగులు. 11 సెంచరీలు, 59 హాఫ్ సెంచరీలు సాధించాడు. భారత్‌ను ఎన్నో సందర్భాల్లో తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఆదుకున్న రాహుల్ ద్రవిడ్‌తో చందర్‌పాల్‌ను పోలుస్తారు. విండీస్ జట్టుకు అతను కూడా పలుమార్లు అసాధారణ ఇన్నింగ్స్‌తో జీవం పోశాడు. చందర్‌పాల్ నిష్క్రమణతో విండీస్ బ్యాటింగ్ లైనప్ దారుణంగా దెబ్బతింటుందనడంలో అనుమానం లేదు.