ఉత్తరాయణం

చిన్న చూపేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న చూపేల?
మన దేశంలో నేడు ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకోవాలి. లేకుంటే భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే చాలా మందికి చిన్నచూపు ఉంటోంది. దేశంలో నూటికి 70 శాతం మంది సరియైన నాణ్యతగల విద్య ఇవ్వటం లేదు. ఇచ్చినా ప్రజలు సరిగా పట్టించుకోవటం లేదు. ప్రతి ఒక్కరు తమకు విద్య కావాలని చెప్పేవారు. తక్కువగా ఉన్నారు. అందరికీ ఒకే రకమైన విద్య 2021 వచ్చినాకూడా అందే పరిస్థితి లేదు. అందరికి ఒకే రకమైన విద్యను అందించాల్సిన అవసరం వుంది. ఒక్కరు ఎక్కువ కాదు, ఒక్కరు తక్కువగా కాదు అనే భావన ప్రతి ఒక్కరిలో వచ్చినప్పుడు ఇది సాధ్యం అవుతుంది. దేశం మొత్తం ఒకే రకమైన విద్య ఇవ్వనప్పుడు దేశంలో ఆర్థిక అసమానతలు వచ్చి అనేక సమస్యలు దారితీస్తాయి.
- ముత్తన్నగారి రాజేందర్‌రెడ్డి, వరంగల్
నెరవేరని వాగ్దానాలు
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కి సంవత్సరంన్నర పూర్తికావస్తున్నా చేసిన వాగ్దానాలలో అయిదు శాతం కూడా నెరవేర్చలేదు. రైతులందరికీ రుణమాఫీ అంటూ ఎన్నికలలో ఊదరగొట్టిన టిడిపి ఇప్పటివరకు కేవలం అయిదు శాతం మందికి తూతూ మంత్రం చందాన రుణమాఫీ చేసి చేతులు దులిపేసుకుంది. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఊసే లేదు. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కి కూర్చొని సామాన్యుల బ్రతుకులను ఛిద్రం చేస్తున్నా పట్టించుకునే వారే లేరు. బాబు వస్తే జాబు గ్యారంటీ అన్నారు, లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. వందల సంఖ్యలో కూడా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ విద్య, వైద్యం నిర్వీర్యమైపోయి, ఈ రంగాలలో ఆధిపత్యం చెలాయిస్తున్న కార్పొరేటు సంస్థలు పేద, మధ్యతరగతి వారికి అందుబాటులో లేకుండా దేవుడే దిక్కు అన్నట్లు చేస్తున్నారు. పారిశ్రామిక వృద్ధి ఆశించిన విధంగా లక్ష్యాలను చేరుకోలేకపోయింది. ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అంటూ ఏమైనా వుంటే అది గల్లీగల్లీలో మద్యం దుకాణాలను తెరిచి మద్యాన్ని ఏరులై ప్రవహింపచేయడమే. ఇటీవలి కాల్‌మనీ కేసు మన రాష్ట్రాన్ని స్కామాంధ్రప్రదేశ్‌గా మార్చేసింది. మాతాశిశు మరణాలలో అత్యధిక రికార్డు నమోదు చేసాం. పనిచెయ్యని అధికారులకు తరచుగా వార్నింగులు ఇచ్చే ముఖ్యమంత్రి తన మంత్రులచేత మెరుగైన ఫలితాలను రాబట్టలేకపోతున్నారు. నవ్యాంధ్రకు రాజధాని నిర్మాణం ఒక్కటే ఎజెండాగా, కొత్త రాజధానితో రాష్ట్రం ఎదుర్కొనే సమస్యలన్నీ తీరిపోతాయన్నట్లు ప్రవర్తిస్తోంది. విపక్షాలు కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో ఘోరంగా విఫలమయ్యాయి.
- ఎం.కనకదుర్గ, తెనాలి
అహింసకు చిహ్నం
గోహత్యా నిషేధాన్ని ఉల్లంఘన సర్వసాధారణమైంది. హిందువుల మనోభావాలను కించపరుస్తూ గోవులను వధించడం పరిపాటి అయంది. ప్రభుత్వం కూడ గోవధ నిషేధాన్ని కఠినతరం చేయాలి. గోహత్య నిషేధము, హిందువుల అహింసావాదానికి చిహ్నం. హిందువులు పండుగలలో జంతు బలులను, నిషేధించి ప్రభుత్వం, మహమ్మదీయుల జంతు బలులను ఎందుకు నిషేధించదు?
- వంగూరి వెంకట్రామయ్య, సిద్ధాంతము, ప.గో.జిల్లా
అర్థంకాని పాఠ్యాంశాలు
పతనమవుతున్న విలువలు.. పునరుద్ధరించాలని ముఖ్యంగా విద్యార్థి లోకంలో వాటి అవసరం ఎంతైనా వుందన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖవారు బిఏ బియస్సీ బికాం లాంటి డిగ్రీ తరగతుల ప్రథమ సంవత్సరం ఫౌండేషన్ కోర్సు-1గా ఎథిక్సు వాల్యూస్ అనే పేరుతో రెండేళ్ల నాడే ప్రవేశపెట్టారు. లుప్తమవుతున్న విలువలు నిలబెట్టటానికి ఉద్దేశించిన ప్రయత్నం మంచిదే కాని.. ఆ సిలబస్ పాఠ్యాంశాలు అర్ధంకానివి.. నేర్చుకొనేవారి వయసు అవగాహన స్థాయినిబట్టి నేర్చుకొనే విషయం వుండాలన్న కనీస ఇంగితం దీనిని ప్రవేశపెట్టిన పెద్దలకున