క్రీడాభూమి

క్రికెటర్ బొదీపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, జనవరి 25: భారత్‌లో జన్మించి, దక్షిణాఫ్రికాలో స్థిరపడిన క్రికెట్ బొదీపై 20 సంవత్సరాల సస్పెన్షన్ వేటు పడింది. గత ఏడాది జరిగిన ప్రతిష్ఠాత్మక రామ్ శ్లామ్ క్రికెట్ టోర్నమెంట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు అతనిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. స్వతంత్ర ప్రతిపత్తిగల కమిటీతో విచారణ జరిపించిన క్రికెట్ సౌతాఫ్రికా (సిఎస్‌ఎ) బొదీని 20 ఏళ్ల పాటు క్రికెట్ నుంచి నిషేధించింది. కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సస్పెన్షన్ కాలంలో అతను క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉండక తప్పదని స్పష్టం చేసింది.