ఉత్తరాయణం

చరిత్ర వక్రీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజస్థాన్‌లో సూర్యప్రతాప్ సింగ్ రాజవత్ లాగా దీనా నాథ్ బాత్రా తన 85వ ఏట కూడా విద్యారంగ సంస్క రణలపై అలుపెరుగని కృషి చేస్తున్నారు. సోనియా విజాతీయురాలి కనుసన్నలలో మానవ వనరుల శాఖా మంత్రి అర్జున్ సింగ్, రొమెల్లా థాఫర్, ఇర్ఫాన్ హబీబ్, సెక్యులర్ పేరుతో ఎన్.సి.ఆర్.టి. సంస్థను ‘సిక్’ చేశారు. వామపక్ష చరిత్రకారులకు పట్టం కడితే ఎడమ చేతివాటానికి పని కల్పించారు. ఆర్య ద్రావిడ సిద్ధాంతం లో భారత్‌ను విభజించాలనే ఎత్తులను థాఫర్ అనుయా యులు చేశారు. యుపీఏ పాలనలో విద్యావిధానాలను తప్పుదోవ పట్టించి నేడు మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీకి పెద్ద పని కల్పించారు.
-దండు కృష్ణవర్మ, సికిందరాబాద్
బాల కార్మికుల వెతలు
తెలంగాణా ఏర్పడిన తరువాత రిటైరైన సూపర్‌వైజర్లు మరియు కార్మికుల బాధలు వర్ణనాతీతం. వారికి కనీసం సదుపాయాలు కల్పించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిశీలించాలని మనవి. ఎపిఎస్‌ఆర్‌టిసిగా వున్నంతకాలం ఎంతో కష్టపడి సంస్థను అభివృద్ధిచేసిన ఘనత ఆర్‌టిసికి దక్కింది. కనీసం ఈ క్రింది సదుపాయాలు కల్పించాలి.
1) తెలంగాణ ఏర్పాటుకు ముందు రిటైర్ అయిన సూపర్‌వైజర్లకు, కార్మికులకు ఎపి, టిఎస్ బస్సులు, సూపర్‌లగ్జరీ బస్సులవరకు భార్యాభర్తలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిచాలి. 2) వారికి పిఎఫ్ మరియు ఎస్‌ఆర్‌బిఎస్ డబ్బులు పెంచండి. కనీసం 5వేలు నుంచి 10వేలు వరకు పెంచండి. 3) ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో భర్తకు ఉచితం భార్యకు సగం టికెట్. ఇది ఎంతవరకు సమంజసం? ఎపిఎస్‌ఆర్‌టిసిగా వున్న సమయంలో కార్మికులు గాని సూపర్‌వైజర్లుగాని ఎంతో శ్రమించారో ఆలోచించండి. సరియైన సమయానికి తిండి తినక, ఎండావాన అనక రాత్రింబవళ్లు కష్టపడి సంస్థను ఎంత అభివృద్ధిచేశారో ఆలోచించండి. చాలామంది సంసారంలో సంతోషమైన జీవితం గడపక పనిచేసిన కార్మికులు, సూపర్‌వైజర్లు బాగోగులు ఎవరు చూస్తున్నారు. అప్పటి జీతాలు ఎంత? ఇప్పటి జీతాలు ఎంత? వారి ఆర్థిక పరిస్థితులు ఎలా వున్నాయి. ఇవన్నీ ఆలోచించి వారికి తగిన కనీసం సదుపాయాలు కల్పించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుకుంటున్నాం. వారి ఆశలు నెరవేరగలవని మా నమ్మకం.
- ఎస్.ఎం.ఎం.మాలవ్య, కరీంనగర్
బాల్యం
1) తల్లిననురాగ బంధమ్ము తరుగనపుడు
నాన్న మమతలు బాల్యాన నల్లుకొనగ
తాత నమ్మమ్మ దీవెనల్ జాతి కంద
వెట్టిచాకిరి నిలువదు! గట్టి బడదు!
2) బాల్యమనగానె విద్య విభాగమనుచు
ఇంటివారల దృష్టిలో యిమడవలయు
చదువు సంస్కరణంబులు మదికి జేర్చి
మానవత్వము నిల్చుడీ మాన్యులార!
3) నేటి బాలలు రేపటి నీతిపరులు
కోటి దివ్వెల వెలుగులు చాటగలరు
చదువుసంధ్యలు గలిగిన సంఘమందు
పదవిలేకున్న బద్రత పట్టుబడును
4) గురువులందించు సూత్రాలు మరువబోక
నేర్వగలిగిన బాల్యము నేర్పుజూప
లోకరీతులు నిత్యమై సాకగలవు
బాలబాలిక లేగద భవితయనగ!
- కె.ఈశ్వరప్ప, ఆలూరు
పవర్‌లూం కార్మికులపై చిన్నచూపేలా?
పవర్‌లూం కార్మికులపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని మరమగ్గాల కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికులకు సత్వరమే వ్యక్తిగత వడ్డీలేని రుణాలు, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరించాలని కార్మిక నాయకులు కోరుతున్నారు.
- గుండు రమణయ్య, పెద్దాపూర్
కొరవడిన వ్యాపార నీతి
దీపావళి నుండి చెన్నైలో కురిసిన కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించిపోగా, చంటి పిల్లలు కనీసం పాలు కూడా తాగే పరిస్థితి లేకపోయింది. పాలు దొరికినచోట వ్యాపారులు ఇరవై రూపాయల అర్ధలీటరు పాకెట్‌ను రెండు వందలకు అమ్మారట. అలాగే మంచినీళ్ళ క్యాన్ ఇరవై లీటర్లకు అయిదింతలకు తక్కువ అమ్మలేదట. గతిలేక కొందరు ధనవంతులు మాత్రంకొన్నారు. గతంలో కృష్ణానది వరదకు కర్నూలు పట్టణంలో యిదే పరిస్థితి వచ్చినప్పుడు ప్లేటు భోజనం రెండుమూడు రెట్లు రేటు పెంచి ధనం మూటగట్టుకున్నారట. ఈ అవినీతి, అక్రమాలవల్లే భయంకర ప్రళయాలు సంభవించి, కొందరివల్ల అందరూ బాధలు పడుతున్నారు. వ్యాపార నీతి ఓ నేతిబీరకాయ అయిపోతున్నది.
- ఎన్.రామలక్ష్మి, సిందరాబాద్
ఆత్మహత్య మహాపాపం
ఆత్మహత్యలు యదేచ్ఛగా జరుగుతున్నా ప్రభుత్వాలు గాని, ఎన్.జి.ఓలు గాని పట్టించుకోవడం లేదు. రైతులు నిరుద్యోగులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, బలవంతపు వివాహాలు చేయబడినవారు తమకి ఇష్టంలేని కోర్సుల్లో చేరిన విద్యార్థి, విద్యార్థులు, ప్రేమ విఫలం అయినవారు పరీక్షల్లో తప్పినవారు అనేక శారీరక, మానసిక ఒత్తిడితో ఉన్నవారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మానవ హక్కుల కమిషన్లు వీటిపై దృష్టిసారించి, ఓ టోల్‌ఫ్రీ నెంబర్ ప్రవేశపెట్టాలి. ఆత్మహత్యలు పాపమని తెలియజేయాలి. ప్రతీ వీధిలోనూ ప్రచారం చేయాలి. చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి.
- విరూపాక్షి, విశాఖపట్నం