చరణ్ రక్షక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ కథానాయకుడుగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా
రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో విజయవంతమైన ‘తనిఒరువన్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అన్ని కమర్షియల్ అంశాలను జోడించి రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ కథాకథనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ చిత్రంపై రామ్‌చరణ్‌కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో నటిస్తున్నారట. ఈ సినిమాలోని అసలైన ఎమోషన్‌లను, మైండ్ గేమ్‌ను ఏమాత్రం మార్చకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అనేక మార్పులుతో రూపొందిస్తున్నారు. తమిళంలో విలన్‌గా నటించిన అరవింద్‌స్వామి తెలుగులోను ఆ పాత్రలోనే నటిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి ‘రక్షక్’ అనే పేరును పరిశీలిస్తున్నట్లుగా టాలీవుడ్ సమాచారం.