జాతీయ వార్తలు

చొరబాట్లు బాగా తగ్గాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఫిబ్రవరి 14: గతంతో పోలిస్తే నియంత్రణ రేఖ అవతలివైపు నుంచి కాశ్మీర్‌లోకి చొరబాట్లు గణనీయంగా తగ్గాయని ఆర్మీ తెలిపింది. ప్రస్తుతం నియంత్రణ రేఖ అవతలివైపు నుంచి కాశ్మీర్ లోయలోకి చొరబడటానికి వేచిచూస్తున్న ఉగ్రవాదుల సంఖ్య వందలోపే ఉందని శ్రీనగర్‌లోని చినార్ కాప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జిఒసి) లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా చెప్పారు. కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఇద్దరు జవాన్లకు ఆదివారం ఇక్కడ ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియంత్రణ రేఖ పొడవున గల భూభాగం చొరబాట్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆర్మీ ఉగ్రవాదుల చొరబాట్లను గణనీయంగా అడ్డుకుంటోందని ఆయన వివరించారు. ‘చొరబాట్లు జరుగుతున్నాయనే అంశాన్ని నేను ఖండించను. 2015లో 600కుపైగా చొరబాటు యత్నాలు జరిగినట్టు మాకు సమాచారం అందింది. అయితే మేము ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహించడం, నియంత్రణ రేఖ వెంట అప్రమత్తంగా ఉండటంతో చొరబాట్లను బాగా అడ్డుకోగలిగాము. దీంతో చొరబాటుదారుల సంఖ్య బాగా తగ్గింది. పది పదిహేనేళ్ల క్రితం చొరబాట్లు ఏ స్థాయిలో జరిగేవో మీకు తెలుసు. ఈ రోజు అవి చాలా స్వల్పస్థాయికి తగ్గాయి’ అని దువా అన్నారు. నియంత్రణ రేఖ పొడవున అవతలివైపునుంచి కాశ్మీర్‌లోకి చొరబడటానికి వేచిచూస్తున్న ఉగ్రవాదుల సంఖ్య కూడా బాగా తగ్గిందని ఆయన వెల్లడించారు. వీరి సంఖ్య ప్రస్తుతం వందలోపు ఉందని ఆయన పేర్కొన్నారు.
ఉగ్రవాదులు కుప్వారాలోకి చొరబడటానికి ప్రయత్నాలు చేసినట్టు ఎక్కువ సమాచారం అందిందని, అయితే సైన్యం నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు విజయవంతం కావడంవల్ల చొరబాట్లను బాగా అడ్డుకోగలిగామని ఆయన వివరించారు. కుప్వారా జిల్లాలో గత మూడు నెలల్లో చొరబాట్లు జరిగినట్లు తమకు అనేక ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, అందువల్ల ఆ జిల్లాలో అనేక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహించామని చెప్పారు. దీనివల్ల ఉగ్రవాదులు కాశ్మీర్ లోయలోకి బాగా లోపలికి చొచ్చుకు రాలేకపోతున్నారని చెప్పారు. అలా చొరబడిన ఉగ్రవాదులే కుప్వారా జిల్లాలో జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో హతమవుతున్నారని ఆయన వివరించారు.