జాతీయ వార్తలు

కోర్టులో దౌర్జన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశ ద్రోహ కేసును ఎదుర్కొంటున్న జెఎన్‌యు విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌ను సోమవారం ఢిల్లీలోని పాటియాల హౌస్ కోర్టుకు హాజరు పరిచిన సందర్భంగా తీవ్ర స్థాయిలో ఘర్షణలు, హింస చోటుచేసుకున్నాయి. కొందరు లాయర్లు పాత్రికేయులు, విద్యార్థులు, టీచర్లపై దాడులకు దిగారు. కోర్టు ఆవరణలోనూ, బయటా కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వీరిని జాతి వ్యతిరేక శక్తులుగా పేర్కొంటూ నినాదాలు చేశారు. రిమాండ్ వ్యాజ్యాల నిమిత్తం కన్హయ్యను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లవ్‌లీన్ కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, నిందితులకు ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలను తేల్చాలంటే కన్హయ్యను కస్టడీ విచారణకు అప్పగించాలని పోలీసులు కోరారు. అయితే మరో రెండు రోజుల పాటు అంటే 17వరకూ కన్హయ్య పోలీసు కస్టడీకి మెజిస్ట్రేట్ అనుమతించారు. కాగా, కోర్టు ఆవరణలోకి వచ్చిన లాయర్లు తమను దేశ భక్తులుగా అభివర్ణించుకుని దాడులకు దిగినట్టుగా చెబుతున్నారు. జెఎన్‌యును ఉగ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల డెన్‌గా అభివర్ణించారు. ఓ టెలివిజన్ రిపోర్టర్‌పై దాడి జరిగింది. కోర్ట వెలుపల మరింత తీవ్ర స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ కూడా కొందరు వ్యక్తులు పాత్రికేయులు, విద్యార్ధులు, కోర్టు అధికారులపై కూడా దాడులకు దిగారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ కోసం కోర్టుకు వచ్చిన బిజెపి ఎమ్మెల్యే ఓపి శర్మ సిపిఐ కార్యకర్త జమాయ్‌పై దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. అయితే కోర్టులో జరిగిన ఘర్షణ వాతావరణంలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ ‘హిందుస్తాన్ ముర్దాబాద్’అన్న నినాదాలు వినిపించాయని శర్మ మీడియాకు తెలిపారు. తాను ఎవరినీ కొట్టలేదని వివరణ ఇచ్చారు. ఇలాంటి నినాదాలు చేసిన వారిని కొట్టడంలో తప్పులేదని..చంపినా పాపంలేదని అన్నారు. కోర్టు ఆవరణలోనూ, బయటా కూడా మొత్తం తొమ్మిది మంది పాత్రికేయులపై దాడులు జరిగినట్టుగా తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్‌లో కేసులు దాఖలయ్యాయి. మీడియా ప్రతినిధులపై దాడులు జరిపిన వారిని వదిలేదని లేదని హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి హామీ ఇచ్చారు. కాగా, కోర్టు ఆవరణలో చోటుచేసుకున్న ఘర్షణల్లో ఎవరికీ పెద్ద గాయాలు కాలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ తెలిపారు. అయితే రెండు వర్గాలు తీవ్ర స్థాయిలో వ్యవహరించడం వల్ల ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడిందన్నారు.