సంపాదకీయం

చైనా మాయల మందు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాసిరకం మందులు చైనా నుండి దిగుమతి అవుతుండడానికి దేశమంతటా విస్తరిస్తున్న నకిలీ మందుల వ్యవస్థ వికృతమైన నేపథ్యం. నకిలీ మందుల పుట్టలు పగులుతున్న సమయంలోనే చైనా నుండి నాసిరకం ఔషధాలు దిగుమతి అవుతుండడం సమాంతర విపరిణామం. ఆరోగ్యాన్ని పెంచవలసిన ఔషధాలు హతమార్చడానికి దోహదం చేస్తుండడానికి కారణం నకిలీ ఉత్పత్తులు...నాసిరకం దిగుమతులు! కానీ అన్ని రంగాలలోను అగ్రగామిగా ఉన్నట్టు కీర్తి ప్రతిష్టలను సముపార్జించుకొంటున్న చైనా నుంచి నాసిరకం మందులు దిగుమతి అవడం ప్రపంచీకరణ మాయాజాలం...తమ దేశాలలో నిషేధానికి గురైన తలనొప్పి మాత్రలను, జ్వరం గోలీలను మన దేశానికి ఇతర ప్రవర్థమాన దేశాలకు అంటగట్టడం అమెరికా, ఐరోపా దేశాలలోని వాణిజ్య సంస్థల స్వభావం. ప్రపంచీకరణ వల్ల ఏర్పడిన సమీకృత అంతర్జాతీయ విపణి వీధిని గుప్పెట్లో పెట్టుకున్న చైనా ఇప్పుడు ఈ నాసిరకం ఉత్పత్తులను వర్థమాన దేశాలలో రాసులు పోస్తోంది. అందులో భాగం హైదరాబాద్‌లో పట్టుబడిన చైనావారి నాసిరకం మందులు. క్యాన్సర్ వ్యాధిని నిరోధించనున్నట్లు ప్రచారమైన ఈ చైనా మందులు జంట నగరాలలోని అనేక ప్రముఖ ఔషధ సస్థలవారు దిగుమతి చేసుకుంటున్నారట. ఈ చైనా ఔషధాన్ని ముడిపదార్థంగా వాడుకొని ఈ సంస్థలు తమ మందులను తయారు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఔషధ నియంత్రణ మం డలి అధికారులు వివిధ ప్రముఖ సంస్థల ప్రాంగణాలలో ఈ ‘నాసి’ చైనా మందును పట్టుకొన్నారట. చైనా ప్రభుత్వ నియంత్రణ మందులు ఈ నాసిరకం క్యాన్సర్ నిరోధక మందును పసికట్టలేదా? పసికట్టనప్పుడు ఎగుమతికి ఎందుకు అనుమతిచ్చారు? ఈ మందును మన సంస్థలు దొంగతనంగానో రహస్యంగానో దిగుమతి చేసుకున్నాయా? అన్న ప్రశ్నలు అనవసరమైనవి. ఎందుకంటె చైనా ప్రభుత్వం పరోక్షంగా దొంగ రవాణాను ప్రోత్సహిస్తోంది. మందులు మాత్రమే కాదు, పరిసరాలను పర్యావరాణన్ని పాడు చేయగల సెల్‌ఫోన్లు, బొమ్మలు విచిత్ర ఐంద్రజాల ఆకర్షణీయ వస్తువులు చివరికి పక్షులను పరిమార్చే దారం కూడా చైనా నుంచి కుప్పలు తెప్పలుగా మనదేశంలోకి వచ్చిపడుతున్నాయి...
చైనాలో మన వాణిజ్యం కేవలం కల్తీ మందులకు దొంగరవాణాకు పరిమితమై లేదు. చైనా భౌతికంగాను, వ్యూహాత్మకంగాను కొనసాగిస్తున్న దురాక్రమణలో ఈ వాణిజ్య వ్యవహారం ముడివడి ఉంది. మన రక్షణ వ్యయంతో సమానమైన మన విదేశీయ వినిమయ ద్రవ్యం ఒక మిత్రదేశానికి తరలిపోతున్నట్టయితే ఈ దేశప్రజలు కలత చెందవలసిన పనిలేదు. ఎవరు అంగీకరించినప్పటికీ, ఎవరు అంగీకరించకపోయినప్పటికీ చైనా మనకు మిత్రదేశం కాదు. మన భూభాగాలను చైనా ఏకపక్షంగా దురాక్రమించి ఉన్నంత వరకు చైనాను మనకు శత్రుదేశంగా మాత్రమే భావించడం వాస్తవ జీవన వ్యవహారం...మిత్రదేశంగా భావించి చైనా వాణిజ్య కబంధబంధంలో నానాటికీ మరింతగా కూరుకొని పోవడం జాతీయ ఆత్మహత్యా సదృశం..సరిహద్దు తగాదా నిజానికి చైనా దురాక్రమణ మాత్రమే. దురాక్రమణ పరిసమాప్తం అయ్యేవరకు చైనాతో మానకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు కాని ఉండరాదని మన ప్రభుత్వం నిర్ణయించాలి. అలా జరిగినట్టయితే మనకు ప్రతి ఏటా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల వాణిజ్య లోటు రద్దవుతుంది. ఈ నిధిని మన రక్షణకు ఉపయోగించుకోవడం వల్ల ఇప్పుడైనా సరిహద్దుల భద్రత పటిష్టం కాగలదు.
చైనాను చూసి మనం నేర్చుకోవలసింది చాలా ఉందన్నది ముఖ్యమంత్రి ఇతర రాజకీయ ప్రముఖులు పదే పదే ఆలపిస్తున్న పాట. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఈ చైనా ప్రశంసా గీతాన్ని ఆలపించారు. ప్రస్తుతం తెలంగాణ అవశేషాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు సైతం చైనా నుంచి చూసి నేర్చుకోవలసిన అనివార్యాన్ని పదే పదే ఉద్ఘాటిస్తున్నారు. తమ భూభాగాన్ని ఆక్రమించుకొని ఉన్న, మరిన్ని భూభాగాలను దురాక్రమించడానికై పొంచి ఉన్న పొరుగు దేశాన్ని ప్రపంచంలోని ఏ ఇతర దేశం ప్రజలు కూడా ఇలా ప్రస్తుతించలేదు. మనదేశపు, రాజకీయ వేత్తలకు, మేధావులకు, ఇతరేతర ప్రముఖులకు మాత్రం ఇలా చైనాపట్ల ఘన గౌరవభావం కొనసాగడం విచిత్రమైన వ్యవహారం. చైనాను చూసి మనం నేర్చుకోవలసింది ఏమిటి? తమ దేశంలో పనికిరాని నాసిరకం మందులను ఇతర దేశాలకు అంటగట్టడమా? తమ దేశంలోని పెద్ద పులులను చక్కగా సంరక్షించుకుంటున్న చైనా వాటి సంఖ్యను, దినదిన ప్రవర్ధమానం చేస్తోంది. కానీ మనదేశంలోని పెద్దపులులను వధించి వాటి చర్మాలను గోళ్లను, దంతాలను చైనాకు ఎగుమతి చేసే దొంగవ్యాపారం, కిరాతక కృత్యం దశాబ్దుల తరబడి అప్రతిహతంగా కొనసాగుతోంది. చైనాను చూసి మనం ఇలాంటి చర్యలను నేర్చుకోవాలా? ఈ దొంగ వ్యాపారానికి శార్దూల హనన కలాపానికి చైనా ప్రభుత్వం బాహాటంగా మద్దతునిస్తోంది. చైనా అధ్యక్షుడు ఝజింగ్‌పింగ్ 2011లో ఆఫ్రికాలోని టాంజానియా దేశానికి వెళ్లివచ్చాడు. ఆయన పయనించిన విమానంలోనే అనేక పెట్టెల నిండా ఏనుగు దంతాలను చైనా అధికారులు తమ దేశానికి అక్రమంగా తరలించుకొని వెళ్లినట్టు ఆ తరువాత వెల్లడైంది. ఏనుగు దంతాలను అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న అతిపెద్ద వినియోగదారులు చైనావారు. మనదేశంలోని ఎఱ్ఱచందనాన్ని అక్రమంగా చైనాకు తరలిస్తుండడం నడుస్తున్న వైపరీత్యం. ఇదేనా మనం చైనాను చూసి నేర్చుకోవలసింది?
రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జపాన్, చైనాలు పరస్పర శత్రువులు. చైనా, అమెరికా, బ్రిటన్, రష్యాల మిత్ర కూటమిలో కలిసి జర్మనీ, జపాన్ నాయకత్వంలోని అక్ష కూటమికి వ్యతిరేకంగా పోరాడింది. ఆ తరువాత జపాన్‌కు చైనాకు మధ్య యుద్ధాలు జరుగలేదు. శంకాకూ దీవుల విషయంలో ఉభయ దేశాలకు మధ్య వివాదం నడుస్తోంది. అందువల్ల చైనా ప్రజలకు జపాన్‌ను తమ శత్రు దేశంగా భావిస్తున్నారు. జపాన్ నాయకులు చైనాను పొగడడం కాని, చైనా నాయకులు జపాన్‌ను చూసి మనం నేర్చుకోవాలి అని ప్రకటించడం కాని జరగడం లేదు. చైనాను చూసి జపాన్‌ను చూసి మనం నేర్చుకోవలసింది ఈ జాతీయతా నిష్ఠను...అలా స్వజాతీయతా నిష్ఠ పెరిగినట్లయితే చైనా వాణిజ్య సంస్థల నిధుల కోసం, వారి సాంకేతిక పరిజ్ఞానం కోసం మన రాష్ట్రాల ప్రభుత్వాల నిర్వాహకులు ఎగబడే అవకాశం లేదు. చైనా భౌతికంగా దురాక్రమించి ఉంది. మన సీమలు చైనా బందీలయి ఉన్నాయి. ఇప్పుడు చైనా ఆర్థిక దురాక్రమణను మనమే నిరంతరం పెంపొందిస్తున్నాము. అమరావతి నిర్మాణానికి సైతం చైనా సాయం అవసరమైందట. మధ్య ఆసియా దేశాలలోను, మాల్‌దీవులలోను, నేపాల్ లోను, చివరికి మనకు అత్యంత సన్నిహిత దేశమైన భూటాన్‌లో సైతం చైనా మన వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. ఇది చైనా వారి వ్యూహాత్మక దురాక్రమణ. చైనాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడం ఈ మూడు రకాల దురాక్రమణలకు మూలం.