గుంటూరు

కోల్డ్ స్టోరేజి అగ్నిప్రమాద బాధితులకు నష్ట పరిహార చర్యలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యడ్లపాడు, ఫిబ్రవరి 26: యడ్లపాడులో బుధవారం అగ్నిప్రమాదానికి గురైన సిఆర్ కోల్డ్‌స్టోరేజ్‌లో మిర్చిటిక్కీలు దాచిన రైతులకు సంబంధించి నష్టపరిహార చర్యలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కోల్డ్‌స్టోరేజ్ యజమాని రమేష్‌చంద్ర శుక్రవారం మిర్చి రైతులతో సమావేశమయ్యారు. రైతుల అభిప్రాయాలు సేకరించిన అనంతరం మంచి మిర్చికి క్వింటాల్‌కు 12 వేల రూపాయలు, తాలు రకం మిర్చికి 10 వేల రూపాయలు చెల్లించేవిధంగా కోల్డ్‌స్టోరేజ్ యాజమాన్యం, మిర్చిరైతుల మధ్య అంగీకారం కుదిరింది. ఈ మొత్తాన్ని 15 రోజుల్లోపు చెల్లిస్తామని రమేష్‌చంద్ర రైతులకు హామీ ఇచ్చారు. మొత్తం 150 మంది రైతులు కోల్డ్‌స్టోరేజ్‌లో తమ సరుకు నిల్వచేసుకున్నట్లు తెలిసింది. శుక్రవారం హాజరైన మిర్చిరైతుల వద్ద నుండి వారి వద్దనున్న రశీదుల జిరాక్సు కాపీలను యాజమాన్యం సేకరించింది. ఒక్కొక్క టిక్కీకి 44 కేజీలు చొప్పున బరువుగా నిర్ణయించారు.
ఈ సమావేశంలో మిర్చిరైతుల తరపున గ్రామ వైస్ ప్రెసిడెంట్ ఎం సుబ్బారావు, టిడిపి నాయకులు పోపూరి రాఘవయ్య, జరుగుల అంజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యడ్లపాడు ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు బంధోబస్తు నిర్వహించారు.
ఇళ్ల తొలగింపును అడ్డుకుని న్యాయం చేయండి
* ఎమ్మెల్యే ఆర్కేకి బాధితుల మొర
తాడేపల్లి, ఫిబ్రవరి 26: రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో రూపొందించిన విధంగా నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ హైవే, రహదారుల విస్తరణ వలన తమ ఇళ్లు కోల్పోవలసి వస్తుందని, ఆ చర్యను అడ్డుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత రైతులు, నిర్వాసితులు మున్సిపల్ పరిధిలోని ఎన్‌టిఆర్ కరకట్ట 40 అడుగుల రోడ్డు వద్ద జరిగిన సమావేశంలో స్థానిక ఎంఎల్‌ఏ ఆర్కేకి మొరపెట్టుకున్నారు. మాస్టర్‌ప్లాన్ విడుదల చేసిన నేపథ్యంలో కనకదుర్గ వారధి వద్ద నుండి మణిపాల్ పక్క నుండి ఎన్‌టిఆర్ కట్టమీదుగా, రైల్వేబ్రిడ్జ్ సమీపం నుండి బోటుయార్డు మీదుగా కెయల్‌రావు కాలనీని కలుపుతూ రహదారులుంటాయని పత్రికల్లో వార్తలు రావటంతో ఆయా సర్వే నంబర్లకు చెందిన రైతులు, ఇళ్ల యజమానులు భయాందోళనకు గురయ్యారు. ఈమేరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి బాధితులతో సమావేశమయ్యారు. ఏళ్ల తరబడి శ్రమించి, కడుపుకట్టుకుని సంపాదించిన కొద్దిపాటి మొత్తాలతో నిర్మించుకున్న తమ చిన్న గూడును తొలగించటం భావ్యం కాదని, తమకు న్యాయం జరిగేలా చూడాలని ఎంఎల్‌ఏని వేడుకున్నారు. దీనిపై ఎంఎల్‌ఏ స్పందిస్తూ ముఖ్యమంత్రి పేదల రక్తాన్ని పీలుస్తున్నారని, కృష్ణాతీరంలోని అక్రమ కట్టడాల నిర్మాణదారులకు మద్దతు పలుకుతూ వాటికి చట్టబద్ధతకు కల్పించేందుకు ప్రయత్నించటంలో భాగమే ఈ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం అని తెలిపారు. ప్రజలు అధైర్యపడవద్దని, న్యాయస్థానాల ద్వారా న్యాయపోరాటం చేయాలని, బాధితులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో స్థానిక రైతులు దొంతిరెడ్డి సీతారామిరెడ్డి, చిమిడిపూడి లక్ష్మిరెడ్డి, గాంధీ, వెంకట్రామిరెడ్డి, వేణుగోపాలస్వామిరెడ్డి, కేళి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
విష కాయలు తిని ఆసుపత్రుపాలైన చిన్నారులు
* పది మంది పిల్లలకు తెనాలిలో వైద్య చికిత్స
తెనాలి, ఫిబ్రవరి 26: విషపూరితమైన కాయలు భుజించిన పదిమంది చిన్నారులు వాంతులు, విరోచనాల బారినపడి ఆసుపత్రిపాలైన సంఘటన శుక్రవారం రాత్రి కొల్లూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం కొల్లిపరకు చెందిన చిన్నారులు కొందరు ఆటలు ఆడుకొనే నిమిత్తం గృహాల నుండి వెళ్ళారు. అనంతరం కొద్ది సేపటి తరువాత ఇంటికివచ్చిన వారు వాంతులు, విరోజనాలు ఎక్కువగా కావటంతో తల్లిదండ్రులు భయబ్రాంతులకుగురై పిల్లలందరినీ తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగిన తరువాత తేరుకున్నవారు తాము ఆడుకొనే సమయంలో ఏవో కాయలు తిన్నామని అప్పటి నుండి తమకు ఇలా జరిగిందని చెబుతున్నారు. వైద్యసేవలు అందిస్తున్న వైద్యులు ప్రస్తుతం పిల్లలకు ప్రాణభయం లేదని చికిత్స కొనసాగుతోందని చెబుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ హుటాహుటి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందించి వారి ప్రాణాలను కాపాడాలని వైద్యులను కోరారు. అయితే ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం అదుపులోనే ఉందని వైద్యులు చెప్పటంతో ఆయన ఊపిరి పీల్చుకొని చిన్నారులకు జరిగిన సంఘటనపై తల్లిదండ్రులను ఆరాతీశారు. శుక్రవారం రాత్రి 9గంటల వరకు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు.

సిఎం కుర్చీ పైనే జగన్ ధ్యాస
* టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఫిబ్రవరి 26: ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోని జగన్‌కు ధ్యాసంతా సిఎం కుర్చీపైనేనని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో డొక్కా మాట్లాడారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడతానంటూ జగన్ వ్యాఖ్యలు చేయటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమన్నారు. రాష్ట్ర విభజన తరువాత సమర్ధుడైన నాయకుడు చంద్రబాబునాయుడని నమ్మిన తెలుగు ప్రజలు ఓటు వేసి గెలిపించారన్నారు. మన ఇల్లు దుర్వాసన వెదజల్లుతుంటే పక్కింటికి వెళతామని, అలాగే జగన్ నియంతృత్వ ధోరణితో విసిగి పోయిన వైసిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశంపార్టీలో చేరుతున్నారన్నారు. రంకెలు వేస్తూ మాట్లాడటం జగన్ అవివేకానికి నిదర్శనమన్నారు. జగన్ తన భాషను మార్చుకోవాలని హితవు పలికారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు దూరవౌతున్నారో జగన్ తెలుసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు, విమర్శలు చేయటం తగదన్నారు. ప్రకాశం జిల్లాలో తమ పార్టీ ఎమ్మెల్యేను జెడ్‌పి ఛైర్మన్‌గా గెలిపించటంలో వైసిపి నాయకుల పాత్ర అందరికీ తెలిసిందేనని, వారు చేస్తే ప్రజాస్వామ్యం ఇతరులు చేస్తే అప్రజాస్వామ్యమా అంటూ ప్రశ్నించారు. తాము ఎవరిని ప్రలోభ పెట్టటం లేదని, రాష్ట్భ్రావృద్ధి కోసం కృషి చేస్తున్న చంద్రబాబు విధానాలు నచ్చి మాత్రమే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు. ఇకనైన జగన్ ఇతరులను విమర్శించటం మానుకుని, తన ఇల్లు చక్కపెట్టుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, మైనారిటి ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ ఎండి హిదాయత్, చిట్టాబత్తుని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

అన్ని గ్రామాల్లో ఇ-చిల్లీ విధానం
* లోక్‌సభలో ఎంపి జయదేవ్ వినతి
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఫిబ్రవరి 26: జిల్లాలోని అన్ని గ్రామాలకు ఇ-చిల్లీ విధానాన్ని విస్తరించాలని గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని రైతులందరికీ వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. శుక్రవారం ఈ అంశాన్ని లోక్‌సభలో ఎంపి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గుంటూరు జిల్లాలో పండుతున్న మిర్చి ఆసియా దేశాలతో పాటు అమెరికాకు ఎగుమతి అవుతున్న విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ధరలు పెరగక రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మిర్చిసాగులో నూతన పద్ధతుల పట్ల రైతులు ఆసక్తిగా ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో ఇ-చిల్లీ విధానం ద్వారా 10 గ్రామాల్లోని 1000 మంది మిర్చిరైతులకు మిర్చిబోర్డు వినూత్న ఆలోచనలను సాయాన్ని అందిస్తోందన్నారు. మిర్చి ధరలు, అమ్మకాలపై ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తుందని గుర్తుచేశారు. వినూత్న సంచులు తయారు చేసి కొనుగోలు దారులకు ఆసక్తిచూపేలా ప్యాకింగ్ విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు ఈ విధానాన్ని విస్తరించాలని కోరారు. తద్వారా చాలా దేశాలకు మిర్చి పంటను ఎగుమతి చేస్తున్న రైతులకు లాభం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని జయదేవ్ కేంద్రాన్ని విజ్ఞప్తిచేశారు.

కౌన్సిల్ నుండి వాకౌట్ చేసిన అధికార టిడిపి సభ్యులు
పొన్నూరు, ఫిబ్రవరి 26: దీపం కనెక్షన్ల పంపిణీ కార్యక్రమానికి పిలవకుండా అగౌరవపర్చారని అధికార టిడిపికి చెందిన కౌన్సిలర్లు అలపర్తి చంద్రమోహన్, తమ వార్డులో అభివృద్ధి పనులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ యరసాని శ్రీరామమూర్తి శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్నుంచి వాకౌట్ చేశారు. అధికార పార్టీకి చెందిన మరో కౌన్సిలర్ దాసరి శ్రీనివాసరావు కూడా తన వార్డులో కనీసం చేతిపంపులు కూడా వేయడం లేదని, వేసవిలో ప్రజలు అల్లాడుతారని సమావేశంలో ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌన్సిలర్ల ఆగ్రహావేశాలతో చైర్‌పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత అధ్యక్షతన సమావేశం రసవత్తరంగా సాగింది. అధికార టిడిపి నేతలు ప్రతిపాదించిన పనుల విషయమై ప్రతిపక్ష వైసిపి సభ్యులు కూడా కలిసి మూకుమ్మడిగా నిలదీశారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు హేమలత, వైస్ చైర్మన్ ఆకుల సాంబశివరావు సమాధానం చెప్పడంతో పాటు అధికారుల చేత వివరణ ఇప్పించారు. ఈ సమావేశంలో వైసిపి కౌన్సిలర్లు నయింబాషా, మాణిక్యరావు, శివనాగరాజు, సుఫియా, అనిల్‌కుమారి తదితరులు పాల్గొన్నారు.
2019 నాటికి అర్హులందరికీ ఇళ్లు: ఎమ్మెల్యే శ్రావణ్
మేడికొండూరు, ఫిబ్రవరి 26: తాడికొండ నియోజకవర్గ పరిధిలో 4 మండలాల్లోని అర్హులైన వారందరికీ 2019 నాటికి ఇళ్లు నిర్మించేందుకు కృషిచేస్తామని ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ అన్నారు. ఇళ్ల నిర్మాణ విషయంలో అర్జీదారులకు ఉన్న అపోహలను తొలగించేందుకు ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మేడికొండూరులో శుక్రవారం పర్యటించి దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాలనీలో కొందరు లబ్ధిదారులు గతంలో ఇళ్లను కొంతమేర నిర్మించుకున్నామని, ఆర్థికస్తోమత లేక ప్రభుత్వం నుండి సహకారం అందక నిర్మాణాలు పూర్తిచేయలేకపోయామని, నిర్మాణానికి సహకరించాలని కోరారు. మధ్యలో నిలిచిపోయిన వాటికి ప్రభు త్వ నిబంధనలు వర్తించవని, అంతేకాకుండా ఇళ్లు నిర్మించేందుకు సరిపడా స్థలం లేకుండా ఇళ్లు మంజూరు కావని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబు కాలనీవాసులు రహదారుల కోసం సైడ్‌కాల్వ లు తవ్వి వదిలేయడంతో దోమలు వి జృంభిస్తున్నాయని తెలిపారు. ఎమ్మె ల్యే స్పందిస్తూ ఉపాధి హామీ పథకం ద్వారా సైడ్‌కాల్వలకు మరమ్మతులు చేయాలని ఎండిఒ ఉపాధి హామీ పథకం అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆయన వెంట జెడ్పీటీసీ గుంటుపల్లి సాంబశివరావు, ఎంపిపి మొ క్కల సుబ్బారావు, సర్పంచ్ తలతోటి సంధ్యారాణి, ఎంపిటిసిలు మార్త శ్రీనివాసరావు, మసీదు సలీమాబి, టిడిపి నాయకులు నార్నె శ్రీనివాసరావు, పాములపాటి శివన్నారాయణ, నెలకుదిటి రవి, ఎండిఒ సరళాదేవి, తహశీల్దార్ జగన్మోహనరావు, హౌసింగ్ డిఇ దీనబాబు, ఎఇ లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి శంకరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆస్తి వివాదం నేపథ్యంలో
వృద్ధుడి దారుణ హత్య
శావల్యాపురం, ఫిబ్రవరి 26: ఆస్తి వివాదం నేపథ్యంలో శుక్రవారం ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. వినుకొండ రూరల్ సిఐ టివి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని బొందిలిపాలెం గ్రామానికి చెందిన బోడాల చిన చెన్నయ్య (60) తన ఇంటిలో రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలతో నరికి అతికిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న వినుకొండ రూరల్ సిఐ టివి శ్రీనివాసరావు, ఐనవోలు ఎస్ విజయ్‌చరణ్‌లు సంఘటనా ప్రాంతానికి చేరుకొని హత్యకు సంబంధించిన వివరాలను సేకరించారు.
ఆస్తి వివాదంతోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు బావిస్తున్నారు. క్లూస్‌టీమ్, డాగ్ స్కాడ్ రంగ ప్రవేశం చేసింది. మృతునికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు శావల్యాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సిఐ తెలిపారు.

పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్న ఖాజాబేగ్‌కు
భారీ పోలీసు పహారా మధ్య అంత్యక్రియలు
* మత పెద్దలతో చర్చించిన ఎమ్మెల్యే, జెడ్పీ చైర్‌పర్సన్ * సిఐ సస్పెన్షన్‌తో శాంతించిన బాధితులు
తెనాలి, ఫిబ్రవరి 26: పోలీసులు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ తెనాలి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో పెట్రోలు పోసుకొని నిప్పు అంటించుకున్న ఎండి ఖాజాబేగ్ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందు తూ గురువారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పట్టణ, మండల ముస్లింలు, యువకులు, మత పెద్దలు జరిగిన అన్యాయంపై పలుమార్లు షాదీఖానలో సమావేశమై చర్చించారు. మరోవైపు ఖాజా మృతితో పట్టణంలో 144సెక్షన్ విధించిన పోలీసులు పలు ప్రాంతాలలో భారీగా పోలీసులను దించారు. అలాగే ఆయా ప్రాంతాలలోని వ్యాపారులు ముందస్తుగా పలు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ముస్లిం యువకులు ఖాజా మృతికి నిరసనగా పట్టణంలో భారీ బైకుర్యాలీ నిర్వహించారు. ఖాజా మృతదేహం గుంటూరు నుండి భారీ పోలీసు బలగాల మధ్య వస్తుందన్న సమాచారం అందుకున్న వారు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి భారీ ర్యాలీతో మృతదేహాన్ని ఖాజాబేగ్ గృహం వద్దకు తీసుకువచ్చారు. ఈసందర్భంగా మృతుని గృహం, పరిసర ప్రాంతాలు పోలీసు వాహనాలతో నిండిపోయాయి. ప్రజలు ఎక్కడా గుమికూడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, జిల్లా పరిషత్ చైర్మన్ షేక్ జానీమూన్‌లు మృతదేహాన్ని సందర్శించి ముస్లిం పెద్దలతో చర్చించి సంయమనం పాటించాలని యువతకు సూచించారు. అనంతరం మృతదేహానికి పూలమాలలువేసి ఘననివాళులు అర్పించారు. మరోవైపు జిల్లా ఐజి సంజయ్ ప్రకటనకు ముస్లింలు నిరసన తెలిపిన దృష్ట్యా ముందుగా జిల్లా రూరల్ ఎస్పీ నారాయణనాయక్ ఖాజా మృతి చెందాడన్న వార్త వెలువడగానే మొదటిగా బాధితుల డిమాండ్లలో ఒకటైన సిఐ వై శ్రీనివాసరావును విధుల నుండి తప్పిస్తూ ఆదేశాలిచ్చి వారిని శాంతింపజేశారు. అలాగే మృతి చెందిన ఖాజా కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, సిఐపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని, మరికొన్ని డిమాండ్లు యువకులు చేస్తున్నారు. ఈవిషయాలపై గత మూడు రోజుల క్రితమే ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి సూపరింటెండెంట్ శేషుకుమార్‌కు వినతిపత్రం కూడా అందజేశారు. తుదకు ముస్లిం యువకులు, మతపెద్దలతో ఎమ్మెల్యే రాజేంద్రప్రసాద్, జిల్లా పరిషత్ చైర్మన్ జానీమూన్, డిఎస్పీ సౌజన్యలు జరిపిన శాంతి చర్చలు ఫలించటంతో ప్రశాంతంగా ఖాజాబేగ్ అంత్యక్రియలు భారీ పోలీసుల బలగాల మధ్య పూర్తిచేశారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఇంకా 144సెక్షన్ అమలులోనే ఉంటుందని ప్రకటించారు.

క్వారీ తిరునాళ్లలో రికార్డింగ్ డ్యాన్స్‌లు నిషేధం
చేబ్రోలు, ఫిబ్రవరి 26: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 7వ తేదీన వడ్లమూడి క్వారీ బాల కోటేశ్వరస్వామి దేవాలయం వద్ద జరిగే తిరునాళ్లలో రికార్డింగ్ డ్యాన్స్‌లను పూర్తిగా నిషేధిస్తున్నట్లు సిఐ జి రవికుమార్ హెచ్చరించారు. క్వారీ వద్ద గల శ్రీ త్రిపుర బాల కోటేశ్వరస్వామి ఆలయం వద్ద శుక్రవారం సాయంత్రం మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన విద్యుత్ ప్రభల నిర్వాహకులతో సిఐ రవికుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ ప్రభలపై అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ ప్రభలకు రాజకీయ నాయకుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు ఏర్పాటు చేయరాదన్నారు. రాష్ట్ర రాజధాని సమీప ప్రాంతం కనుక నిఘా ఎక్కువగా ఉంటుందని, నిబంధనల మేరకే నడుచుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రభల ఎత్తు 30 అడుగులకు మించి ఉండరాదన్నారు. సమావేశం లో చేబ్రోలు ఎస్‌ఐ కె ఆరోగ్యరాజు, నారాకోడూరు, వడ్లమూ డి, సుద్ధపల్లి, గుండవరం, గొడవర్రు, శలపాడు తదితర గ్రామాలకు చెందిన ప్రభల నిర్వాహకులు పాల్గొన్నారు.
గుంటూరులో సుప్రీం కోర్టు బెంచ్
* ఎంపి గల్లా జయదేవ్ వినతి
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఫిబ్రవరి 26: గుంటూరులో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఎంపి గల్లా జయదేవ్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ప్రతి శుక్రవారం పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశ పెట్టేందుకు అవకాశం ఉండటంతో ఎంపి గల్లా ఈ మేరకు బిల్లు ప్రవేశ పెట్టారు. గుంటూరు ప్రాధాన్యతను వివరిస్తూ సుప్రీంకోర్టు బెంచ్‌ను ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. 1953-56 మధ్యకాలంలో హైకోర్టు గుంటూరులో ఉండేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత హైకోర్టు హైదరాబాదుకు తరలి వెళ్లిందన్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. 1987లోనే ఐదుగురు సభ్యుల ధర్మాసనం సుప్రీం బెంచ్‌లను దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుదని అభిప్రాయపడిందన్నా విషయాన్ని సభలో ఎంపి గల్లా ప్రస్తావించారు. 1998లో న్యాయ కమిషన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగినందున సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు అన్నీ విధాలా అవసరమన్నారు. అమరావతి రాజధానిగా నిర్మాణం జరుగుతోందని ఈసందర్భంగా గుర్తుచేశారు. అమరావతి దక్షిణాది రాష్ట్రాలకు అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే ప్రజలకు వ్యయప్రయాసలతో కూడుకున్నదన్నారు. ఎంతో ఖర్చు పెట్టి సుదూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం అవుతున్నందున గుంటూరులో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ కేంద్రప్రభుత్వానికి ఎంపి గల్లా జయదేవ్ విజ్ఞప్తి చేశారు.