రాష్ట్రీయం

కాంట్రాక్టుకు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎపి పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ 1994 యాక్ట్‌లో సవరణలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో భర్తీ చేయవచ్చు అని చట్టంలో చేర్చారు. దీనివల్ల 18వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. పూర్తికాలం కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగం చేస్తున్న వారిని ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుంది. 2014 జూన్ రెండన రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కాంట్రాక్టు ఉద్యోగంలో నియమ నిబంధనల మేరకు చేరిన వారిని క్రమబద్ధీకరిస్తారు. కాంట్రాక్టు ఉద్యోగాలు అంటే శ్రమ దోపడీయేనని వీరందరినీ క్రమ బద్ధీకరించనున్నట్టు ఎన్నికలకు ప్రణాళికలో తెరాస పేర్కొంది. దీనిపై అప్పటి నుంచే ఆందోళనలు జరిగాయి. ఎంతోకాలం నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు దీనివల్ల అన్యాయం జరుగుతుందని కొందరు ఆందోళన చేశారు. ప్రభుత్వం మాత్రం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని ప్రకటించింది. ఒకవైపు పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించి ఏడాదిన్నర కావస్తున్నా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకోలేక పోయారు. చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరం అయిన చర్యలు తీసుకుని పగడ్బందీగా నియామకాలు జరపనున్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు చట్టంలో సవరణ చేయడంతో నియామకాలు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. చట్టంలో సవరణల చేసినందున తక్షణం నియామక ప్రక్రియ ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు.