ఖైదీ 150 పాటలో కనిపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెన్షన్‌గా ఉంది
ప్రతి సినిమా విడుదలయ్యేటప్పుడు కచ్చితంగా టెన్షన్ అనేది ఉంటుంది. అయితే ఈ సినిమాకు ఓ స్పెషల్ ఉండడంతో అది మరింత ఎక్కువైంది. రీమేక్ సినిమా అవడంతో ఎలా ప్రేక్షకులు ఆదరిస్తారా అని ఎదురుచూస్తున్నాను.
రీమేక్ ఎందుకు?
రీమేక్, స్ట్రయిట్ అనేది ఏం లేదు. కథ బాగుంటే ఏ సినిమా అయినా చేయాలి. అయితే రీమేక్ తీసేటప్పుడు ఎటూ అక్కడ హిట్టయ్యి ఉంటుంది కనుక దానికి మరింత పదునుపెట్టి చిత్రీకరణ చేయాల్సి వుంటుంది. ఆ జాగ్రత్తలన్నీ ఈ సినిమాకోసం చేశాం. ఎన్.వి.ప్రసాద్ ‘తనిఒరువన్’ సినిమాను చూడమని చెప్పారు. కథ నచ్చడంతో సురేందర్ రెడ్డికి చెప్పాం.
కొత్తగా..
ఈ సినిమాను కొత్తగా చెప్పాలని దర్శకుడు, నేను, నిర్మాతలు ప్రయత్నించాం. మాతృకలో ఉన్న విషయాన్ని ఎక్కడా చెడగొట్టకుండా మరికొంత కథను డెవలప్ చేశాం.
ఒక్క విలన్
ఈ సినిమాలో వంద మంది విలన్లను పంపించు అనొచ్చు గానీ ప్రతి సినిమాలో అలా అనలేం కదా. ఈ సినిమా కథ ప్రకారం ఒక్క విలనే ఉన్నాడు. గత సినిమా ప్రభావం ప్రతి సినిమా మీద పడకుండా చూసుకోవడమూ ముఖ్యమే. కథను బట్టి నటీనటుల ఎంపిక ఉంటుంది కదా.
అరవింద్ స్వామితో..
ఆయన మంచి నటుడు. నాకన్నా సీనియర్. షూటింగ్‌లో ఇద్దరం చాలా క్లోజ్‌గా ఉన్నాం. కొన్ని సన్నివేశాలు చేయాలంటే ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి.
పోలీస్‌గా రిపీట్
‘జంజీర్’ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించాను. అది కథ నచ్చకో తీయటం బాగాలేకో ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ సినిమా మాత్రం అలా ఉండదు. నా పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఫిజికల్‌గా పోలీస్ అధికారిగా నటించడానికి అనేక జాగ్రత్తలు తీసుకున్నాను.
టైటిల్‌లో 8 అంకె ఎందుకు?
అది సినిమా చూస్తేనే తెలుస్తుంది.
రకుల్‌తో..
ఒక సినిమా అయిన వెంటనే మళ్లీ రకుల్‌ప్రీత్‌సింగ్‌తోనే చేయడానికి కారణం ఆమె ఓ మంచి నటి అవ్వడమే. ఈ కథకు ఆమె అయితేనే బాగుంటుందనుకున్నాం. అందుకు తగ్గట్లే ఔట్‌పుట్ ఆమె చక్కగా ఇచ్చింది.
హిప్‌హాప్ తమిళ
‘తనిఒరువన్’ సినిమా జంట దర్శకులు అద్భుతంగా సంగీతం అందించారు. వీరిద్దరూ 25 ఏళ్ల కుర్రాళ్లు. వారి సంగీతం ఇప్పుడు ఓ ఎసెట్‌గా మారుతోంది.
సినిమా టైటిల్ ఎంపికలో ఉపాసన సలహా తీసుకున్నారా?
అలాంటిదేం లేదు.
సుకుమార్‌తో..
సుకుమార్‌తో రూపొందించే చిత్రం సంక్రాంతి తర్వాత ప్రారంభవౌతుంది. నేను రూపొందిస్తున్న 150వ చిత్రం కూడా సంక్రాంతికే విడుదలౌతుంది. ఈనెల 25న ఆడియో విడుదల చేయనున్నాం.
నోట్ల రద్దు ప్రభావం..
కరెన్సీలో 500, 1000 రూపాయలు నోట్ల రద్దు ప్రభావం పరిశ్రమపై బాగానే ఉంది. అయితే ఈ నిర్ణయంతో దేశానికి మంచి జరుగుతుంది కనుక అందరూ ఆమోదించాల్సిందే. ప్రజలు విచ్చలవిడిగా ఖర్చుపెట్టడం మాని, ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. ఈ అలవాటు మంచిదే.
తరువాతి ప్రాజెక్టులు
మణిరత్నంతో ఒకటి, కొరటాల శివతో మరొకటి సిద్ధవౌతున్నాయి. పవన్‌కళ్యాణ్ బ్యానర్‌లో రూపొందించే చిత్రం వచ్చే ఏడాది ప్రారంభవౌతుంది. కథలు నచ్చితే హారర్ చిత్రాలు చేయడానికైనా సిద్ధమే.

- శ్రీ