భల్లాల రానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న బాహుబలి-2 (ది కంక్లూజన్) చిత్రంలో రానా నటిస్తున్న భల్లాలదేవ ఫస్ట్‌లుక్‌ను రానా జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో రానా మొదటి సినిమా కన్నా వైవిధ్యంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తొలి సినిమాలో భల్లాలదేవ ఉపయోగించిన గద ఈ చిత్రంలో కూడా కన్పిస్తోంది. అయితే, చూసిన పాత్రే మళ్లీ చూడటానికి ప్రేక్షకులు ఎంతవరకు ఒప్పుకుంటారో అన్న సందేహంతో భల్లాలదేవ ఆహార్యంలో మార్పులు చేయగా అవి కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. అయితే, కథాపరంగా భల్లాలదేవుడే ప్రతినాయకుడు కనుక బాహుబలికి దీటుగా రూపాలంకరణ, ఆహార్యం రూపుదిద్దునట్లు కన్పిస్తోంది. సినిమా విడుదలైతేకానీ భల్లాలదేవుడి రెండో వీరోచిత ప్రదర్శన ఎలా ఉంటుందో తెలియదు.