బిజినెస్

దేశంలో తొలిసారిగా క్లౌడ్ హబ్ పాలసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), ఫిబ్రవరి 9: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటి సారిగా క్లౌడ్ హబ్ పాలసీని నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సార్ట్‌అప్ కంపెనీలను ప్రోత్సహించే క్రమంలో వారికి డీటీపీ పాలసీ ద్వారా రెంటల్ సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఏపీ మంత్రి నారా లోకేష్.. డెస్క్ ఎరా కంపెనీ సీఈఓ శషాంక్ దీక్షిత్, కో ఫౌండర్ సోమేష్ మిత్రతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ వారికి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పాలసీలు, కల్పిస్తున్న రాయితీలను వివరించారు. ముఖ్యంగా ఆఫీస్ స్పేస్ ఇబ్బందులను అధిగమించే క్రమంలో ప్లగ్ అండ్ ప్లే విధానం ద్వారా సార్ట్‌అప్ కంపెనీలకు అవసరమైన స్పేస్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే డీటీపీ పాలసీ ద్వారా రెంటల్ సబ్సిడీని కల్పిస్తున్నామన్న ఆయన క్లౌడ్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే క్లౌడ్ హబ్ పాలసీని తీసు కు వచ్చినట్లు వివరించారు. డెస్క్ ఎరా కంపెనీ సిఈఓ శషాంక్ దీక్షిత్ మాట్లాడుతూ విశాఖపట్నంలో గత నెలలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా విశాఖ కేంద్రంగా త్వరలోనే కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముందుగా 500 మంది ఉద్యోగులతో కలిసి కంపెనీని అతిత్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పబ్లిక్, ప్రైవేట్ క్లౌడ్, మల్టీటేనన్సీ, వెబ్ సర్వీసస్, ఇంటిగ్రేషన్ సర్వీసెస్‌లలో ఈకంపెనీకి అపూర్వ అనుభవం ఉంది.