బిజినెస్

కేబుల్, డిటిహెచ్‌లో 100 శాతం ఎఫ్‌డిఐలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ట్రాయ్ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: విదేశీ పెట్టుబడులను ఆకర్షించి దేశంలో వౌలిక వసతులను మెరుగుపర్చాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్న కేంద్ర ప్రభుత్వం కేబుల్, డైరెక్ట్ టు హోమ్ (డిటిహెచ్) నెట్‌వర్కులు సహా బ్రాడ్‌కాస్టింగ్ క్యారేజీ, కంటెంట్ సర్వీసుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తోంది. కేబుల్ టీవీ, డిటిహెచ్, మొబైల్ టీవీ, టెలీపోర్ట్, ‘హిట్స్’ (హెడ్‌ఎండ్ ఇన్ ది స్కై బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్) నెట్‌వర్కుల్లో ప్రస్తుతం 74 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంపొందించేందుకు ఉద్ధేశించిన ఈ ప్రతిపాదనలను అంతర్ మంత్రిత్వ కమిటీ పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్ సేవలకు సంబంధించి వార్తలు, కరెంట్ అఫైర్స్ టెలివిజన్ చానళ్ల అప్‌లింకింగ్‌లో ప్రస్తుతం 26 శాతంగా ఉన్న విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై అంతర్ మంత్రిత్వ కమిటీ విస్తృత చర్చ జరుపుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. టెలికామ్ నియంత్రణా సంస్థ (ట్రాయ్) 2013లో ఈ ప్రతిపాదనలు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని బ్రాడ్‌కాస్టింగ్ క్యారేజీ సర్వీసుల్లో 100 శాతానికి, వార్తా చానళ్ల అప్‌లింకింగ్‌లో 49 శాతానికి పెంచాలని ట్రాయ్ సూచించింది. దీని వలన దేశ వ్యాప్తంగా ప్రసార సేవలను డిజిటలైజ్ చేసే ప్రక్రియ వేగవంతమవుతుందని ట్రాయ్ పేర్కొంది. ట్రాయ్ చేసిన మూడు సిఫారసులపై డిఐపిపి (పారిశ్రామిక విధాన, అభివృద్ధి విభాగం), సమాచార, ప్రసార, టెలికమ్యూనికేషన్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఏర్పాటైన అంతర్ మంత్రిత్వ కమిటీ గత నెల నిర్వహించిన సమావేశంలోనే ఒకసారి చర్చిందని, ఈ సిఫారసులపై ప్రస్తుతం మరింత లోతుగా చర్చిస్తోందని అధికార వర్గాలు వివరించాయి.