అంతర్జాతీయం

పాక్ జంటకు ఉగ్ర లింకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలిఫోర్నియా ఘటనపై ఎఫ్‌బిఐ వెల్లడి
దంపతుల అపార్ట్‌మెంట్‌లో సోదాలు
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
వాషింగ్టన్, డిసెంబర్ 4: కాలిఫోర్నియాలో 14 మంది ఊచకోతకు కారకుడైన పాక్ సంతతికి చెందిన సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ (28)కు ఉగ్రవాదులో సంబంధాలున్నట్టు విచారణలో వెల్లడైంది. ఫరూక్ భార్య తష్ఫీన్ మాలిక్ (27) ద్వారా ఉగ్రవాదులతో సంబంధాలు నెరపినట్టు అధికాలు వెల్లడించారు. దంపతులు నివసించిన అపార్ట్‌మెంట్‌లో పోలీసులు సోదాలు నిర్వహించగా ఆయుధాలు, 12 పైప్ బాంబులతోపాటు అనేక పేలుడు పదార్థాలు లభించాయి. కాలిఫోర్నియాలోని సాన్ బెర్నార్డినో బుధవారం జరిపిన కాల్పుల్లో 14మంది మృతి చెందారు. ఎఫ్‌బిఐ అధికారులు కేసు విచారణ ముమ్మరం చేశారు. సెల్‌ఫోన్లు, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫరూక్ దాడిలో 21 మంది గాయపడ్డారు. సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ పాకిస్తాన్ సంతతికి చెందినవాడు. అతడి భార్య తష్ఫీన్ మాలిక్ పాకిస్తాన్ చెందినదేనని ఎఫ్‌బిఐ అధికారులు వెల్లడించారు. ఊచకోత ఘటనతో పోలీసులు జరిపిన కాల్పుల్లో దంపతులిద్దరూ మృతి చెందారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో 150 బుల్లెట్లను దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. చనిపోయిన 14 మంది వివరాలు ఎఫ్‌బిఐ విడుదల చేసింది. మృతులు 26 నుంచి 60 ఏళ్ల లోపువారని అన్నారు. క్రిస్మస్ వేడుకలు జరిగే ఇన్‌లాండ్ రీజనల్ సెంటర్ లక్ష్యంగా దంపతులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. రీజనల్ సెంటర్ లోపల 150 బుల్లెట్లను కనుగొన్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.