సబ్ ఫీచర్

దోషం కాల్‌మనీలో లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుల సగటు ఆయుఃప్రమాణం 1920 ప్రాంతంలో చాలా తక్కువగా ఉండేది. ఆ కాఠణంగా అన్నదమ్ములు చిన్న వయస్సులోనే తల్లితండ్రులిద్దరినీ కోల్పోయారు. కొద్దిపాటి వ్యవసాయ భూమి మాత్రమే ఉన్న వారికి చదువుకోవాలన్న కోరిక తీవ్రంగా ఉంది. నేటివలె ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మీల్స్ వం టివి అప్పుడు లేవు. ప్రభుత్వ పాఠశాలలోనైనా ఫీజుకట్టి చదువుకోవలసిందే. అన్నగారు వయస్సులో చిన్నవాడైనా ఆలోచించి పరిష్కారం కనుగొన్నాడు. జూన్ నెలలో భూ మిని తాకట్టుపెట్టి, స్కూల్లో ఫీజులుకట్టి, పుస్తకాలు కొనుక్కోవడం, సంక్రాంతికి పంట తాలూకు శిస్తులు రాగానే, అప్పుతీర్చి, భూమిని విడిపించుకోవడం. అనేక సంవత్సరాలు ఆ విధంగా చేసి అన్నతమ్ములిద్దరూ ఆ రోజుల్లో అరుదైన డిగ్రీని సాధించారు. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే అప్పు తీర్చగలమని అన్నతమ్ములకు ధైర్యముంది, వీరికిచ్చిన అప్పు వసూలవుతుందన్న వివే కం అప్పిచ్చిన షావుకారుకుంది.
అప్పు ఇవ్వడం, చేయడం కూడదని ఆంగ్ల కవి షేక్స్‌పియర్ అని ఉండవచ్చుగాక కానీ అప్పులేకుండా జీవితం ఎంతటి వారికీ గడవదు. అప్పిచ్చువాడు లేని ఊర్లో ఉండరాదని సుమతీ శతక కర్త అన్నాడు. అయితే అప్పును ఎట్టి పరిస్థితిలోనైనా తీర్చెయ్యాలి. నమస్కరించదగిన వారు నలుగురన్న ప్రాచీన శ్లోకమొకటున్నది. ఆపదలో ధైర్యవంతుడు, సంపదలో వినయవంతుడు, రణంలో ధీరుడు, ఋణంలో శుచి సదా పూజనీయులు. అప్పు విషయంలో శుచిగా ఉండాలి. శరీరానికి అంటుకున్న మలినాలను ఎలా తొలగించుకుంటామో అప్పు అనే మలినాన్ని తొలగించుకుని శుచిగా ఉండాలి. అప్పుచేసిన నాడే తీర్చే విధానం గురించి ఆలోచించాలి.
వ్యవసాయదారులకు పంట వేసేటప్పుడు అప్పుచెయ్యడం, పంట రాగానే తీర్చెయ్యడం సాధారణం. వ్యాపారుల విషయంలో కూడా సరుకు కొనుగోలుకై అప్పుచెయ్యడం, అమ్మకం పూర్తికాగానే అప్పుతీర్చడం జరుగుతాయి. ఇటువంటి దీర్ఘకాలిక ఋణాలే కాక స్వల్పకాలిక ఋణాలు కూడా ఉంటాయి. కూరలూ, పళ్ళూ అమ్మి జీవనం గడిపే చిన్న వ్యాపారులు ఉదయమే అప్పుచేసి సాయంత్రం తీర్చేస్తూ ఉంటారు. సాధారణ గృహిణికి కూడా స్వల్పకాలిక ఋణం తీసుకునే పరిస్థితి ఎదురవుతుంది. ఎటిఎమ్‌కి వెళ్ళి డబ్బు తెచ్చుకునే లోగా గ్యాస్ సిలిండర్ విడిపించుకోవలసి రావచ్చు. కిరాణా సరుకులు కొనుక్కునేలోగా ఇంటికి అతిధులు రావడం, కాఫీ పౌడరు లేకపోడం జరగచ్చు. అప్పూ, అరువూ ఎవరికైనా తప్పనిసరి.
సామాన్యమైన జీవితం గడిపే గృహిణులకూ, చిన్న వ్యాపారులకే కాదు బ్యాంకులకే స్వల్పకాలిక ఋణం అవసరమయ్యే పరిస్థితులు ఎదురౌతాయి. బాంకులలో ఆర్థిక లావాదేవీలు ప్రతినాడూ ఒక్కలా ఉండవు. రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన క్యాష్ రిజర్వ్ రేషియోలో తేడారాకుండా ఉండడానికై బాంకులు ఒకదాని దగ్గర ఒకటి అప్పు చేస్తూంటాయి. వీటిపై వడ్డీ నిలకడగా ఉండ దు. బ్యాంకుల అవసరాలనుబట్టి రోజురోజుకీ మారుతూ ఉంటుంది. (్ఫన్‌కాల్స్ మీద తెప్పించుకోవడంవల్లనేమో) ఈ రకమైన అప్పులకు కాల్‌మనీ అని పేరుంది. కాల్‌మనీలో దోషం లేదు.
కాల్‌మనీ అనేది అమ్మాయిలను కాల్ చేసే స్థితికి ఎలా దిగజారింది? ఇందులో అప్పిచ్చి, ఆనందించే వారి దోషమెంత? అప్పు తీసుకుని వ్యభిచార కూపంలో దిగిన వారి లోపమెంత? అప్పుచేసిన నాడు తీర్చాలన్న సంగతి ఎందరు గుర్తుంచుకుంటున్నారు? అప్పు తీర్చడం ఎలా అని ఎందరు ఆలోచిస్తున్నారు? ‘కాల్‌మనీ’అన్న పేరుతో ప్రస్తుతం నడుస్తున్న వ్యాపారంలో ఋణగ్రస్తులలో స్ర్తిల శాతమెంత? వారిలో అవసరానికి అప్పుచేసే వారెందరు, విలాసాలకై అప్పుచేసే వారెందరు? నేటి వ్యాపార సంస్కృతి ఫలితంగా పూర్వం విలాసాలుగా కన్పించేవన్నీ నేడు నిత్యావసరాలుగా కన్పించడం విషాదకరం. చదువురాని మహిళలను సైతం టీవీలో ప్రకటనల ద్వారా వ్యాపారులు ఆకర్షిస్తున్నారు. దిగువ మధ్యతరగతి, శ్రామిక వర్గాలలోని స్ర్తిలు సైతం అప్పుచేసైనా అన్నీ అనుభవించాలన్న భ్రమలో ఉన్నారు. అటువంటి మహిళలకు కాల్‌మనీ అనేది కోరికలు తీర్చడం ద్వారా తమ కోరికలు తీర్చుకోవచ్చునని చెప్పి, వ్యభిచరించ వచ్చునని సున్నితంగా సూ చించి మరీ వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. ఇది చాలా కాలంగా జరుగుతున్నదే. వ్యాపారుల మధ్య ఘర్షణ వల్లనో, రాజకీయ పక్షాల వైరం వల్లనో, టివి చానె ళ్ళు టిఆర్‌పిలు పెంచుకుందుకు చేసిన ప్రయత్నం వల్లనో విషయం బయటపడేసరికి అందరూ తాము బాధితులమనే చెప్పుకుంటున్నారు.
అప్పుచెయ్యడానికై అణాబిళ్ళమీద సంతకం పెట్టడం అవమానంగా భావించే కాలం, అప్పెగ్గొట్టడం మహాపాపంగా భావించే రోజులుపోయి ఎలా తీర్చగలమన్న భయం లేకుండా అధిక వడ్డీపై అప్పుతీసుకోడం సామాన్యమవడానికి కారణాలేమిటి? అప్పుచేసి పప్పుకూడు తినడం తప్పుకాదన్న వ్యాపారుల ప్రకటనలు ఒక కారణమైతే ఋణమాఫీని హక్కుగా తయారుచేసిన ఓటు బ్యాంకు రాజకీయం మరొక కారణం. ఋణ మాఫీ అన్నది సనాతన సంప్రదాయం కాదు. సత్యసంధతను పరీక్షించడానికై విశ్వామిత్రుడు పన్నిన మాయోపాయంవల్ల హరిశ్చంద్ర చక్రవర్తి ఋణగ్రస్థుడయ్యాడు. అప్పుతీర్చడానికై అష్టకష్టాలు పడ్డాడు. ఆయన ధర్మపత్ని తనను పనిమనిషిగా ఎవరికైనా అమ్మి అప్పుతీర్చమని ప్రోత్సహించింది. (హరిశ్చంద్రుడు ఇల్లాలిని అమ్మి పడెయ్యలేదని స్ర్తివాదులకు తెలియదో, తెలియనట్లు నటిస్తున్నారో?) కష్టనష్టాలకు ఓర్చి అప్పుతీర్చడం భారతీయులు ప్రాచీనకాలంలో నమ్మిన నీతి కనుకనే తప్పని సరైనప్పుడు, అప్పుతీర్చగలమన్న నమ్మకమున్నప్పుడు మాత్రమే అప్పుచెయ్యడం సుమారు యాభై ఏళ్ళ కిందట కూడా సామాన్యం.
ప్రస్తుతం నెగొషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆక్ట్, పాన్‌బ్రోకర్స్ యాక్ట్ మొదలైన చట్టాలు వడ్డీరేటుని నియంత్రిస్తున్నాయి. శతైక వృద్ధి (నూటికి నెలకి రూపాయ లేదా ఏడాదికి 12శాతం) భారతీయ నీతి చెప్తున్న వడ్డీ రేటు. ధర్మాన్నీ, చట్టాన్నీ ఉల్లంఘించి అత్యధికంగా చక్రవడ్డీ రేటును వ్యాపారులెలా నిర్ణయించి, అప్పులివ్వగలుగుతున్నారు? అటువంటి వ్యాపారులు దురాశాపరులైన దుర్మార్గులనీ, ప్రభుత్వం ప్రజలను పట్టించుకోడం లేదనీ ఎవరూ కాదనరు. లోకంలో ఏ వస్తువు ధర అయినా దానికున్న డిమాండ్‌నిబట్టి నిర్ణీతవౌతుంది. అత్యవసర పరిస్థితులలో, తీర్చగలమన్న నమ్మకమున్నప్పుడే అప్పుచేస్తామన్న నిర్ణయం ప్రజలు తీసుకుంటే అప్పుకి అవసరం తగ్గి వడ్డీ రేటు, ఇతర కండిషన్లు తగ్గిపోయే అవకాశముంటుంది.
ఈ విషయంలో ‘‘ఆకాశంలో సగం’’ అయిన అతివలు బాధ్యత వహించడం ముఖ్యం. సులువుగా లభిస్తోంది అన్న ఆశతో అధిక వడ్డీకి అప్పుతీసుకుని, తీర్చలేని పరిస్థితులలో తమవీ, కూతుళ్ళవీ, కోడళ్ళవీ శరీరాలు తాకట్టుపెట్టి, వాయి కట్టుకుని, జీవితానే్న వాకట్టు చేసుకోడం అభిలషణీయం కాదు. ఏ వస్తువులోనూ, ఏ వ్యవస్థలోనూ లోపముండదు. కాల్‌మనీ వ్యవస్థ లేకుండా ఆర్థిక రంగం లేదు. దేన్నైనా సరైన పద్ధతిలో వినియోగించుకోడంలోనే విజ్ఞత ఉంది.

- పాలంకి సత్య