రాష్ట్రీయం

బాబు చేతికి కాల్‌మనీ నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిఎస్‌ను కలిసిన విజయవాడ సిపి
శాసనసభలో నేడు ప్రభుత్వం ప్రకటన

హైదరాబాద్, డిసెంబర్ 17: సంచలనం కలిగించిన విజయవాడ కాల్‌మనీ కేసుకు సంబంధించిన నివేదికను కమిషనర్ గౌతమ్‌సవాంగ్ డిజిపికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారు. అనంతరం ఆయన సిఎం చంద్రబాబును కలిసి విజయవాడలో కాల్‌మనీ కేసు పురోగతిని వివరించారు. కాల్‌మనీ కేసులో వడ్డీవ్యాపారుల ఆగడాలు వేరుగా, సెక్స్‌రాకెట్ వ్యవహారం వేరుగా తీసుకుని ఫిర్యాదుల ఆధారంగా వేర్వేరు కేసులను నమోదు చేసినట్టు సిపి గౌతమ్ సవాంగ్ సిఎంకు వివరించినట్టు తెలిసింది.
మరో పక్క ఈ అంశంపై న్యాయవిచారణ జరిపించాలని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన దరిమిలా తాజా పరిస్థితిని వివరించినట్టు సిపి చెప్పారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశంపై శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రకటన చేయనున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు, ఫైనాన్షియర్ల ఆగడాలను అరికట్టేందుకు మనీల్యాండరింగ్ చట్టాన్ని తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాల్‌మనీ వ్యవహారంపై రాష్టవ్య్రాప్తంగా పలు జిల్లాల్లో 115 మందిని అరెస్టు చేశారు.
విజయవాడలో 85 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సెక్స్‌రాకెట్ పేరుతో ఏడు కేసులను పోలీసులు నమోదుచేయగా, ఇంతవరకూ ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులకు సంబంధించి ఐదుగురు పరారీలో ఉన్నారు.