క్రీడాభూమి

ఢిల్లీ వీరుల సన్మానం రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: చివరి వరకూ అత్యంత నాటకీయ మలుపులు తిరిగిన కార్యక్రమం చివరికి రద్దయింది. మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ తోపాటు 1983, 2011 సంవత్సరాల్లో ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న భారత జట్లలోని ఢిల్లీ ఆటగాళ్లను ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శనివారం సన్మానించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) నుంచి అనుమతిని కూడా తీసుకుంది. అయితే, ప్రస్తుతం ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ జరుగుతున్నందున మైదానాన్ని ఇతరత్రా కార్యక్రమాలకు వినియోగించరాదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. మైదానంలోకాకుండా, స్టాండ్స్‌లో పోటీని నిర్వహించుకోవచ్చని సూచించింది. కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోట్లా మైదానంలోనే, శనివారం ఉదయం 9.05 నుంచి 9.15 గంటల వరకు ఢిల్లీ వీరుల సన్మాన కార్యక్రమాన్ని జరపాలని పట్టుబట్టాడని సమాచారం. అందుకు బిసిసిఐ ససేమిరా అనడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ సర్కారు ప్రకటించింది. బేడీతోపాటు మొహీందర్ అమర్‌నాథ్, మదన్‌లాల్, వీరేందర్ సెవాగ్, గౌతం గంభీర్ తదితర పది మంది ఢిల్లీ క్రికెటర్లను సన్మానిస్తామని ఢిల్లీ సర్కారు ప్రకటించింది.
బేడీ నిరాశ: ఢిల్లీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు శనివారం ఉదయమే ఫిరోజ్ షా కోట్లా మైదానానికి చేరుకున్న బేడీ నిరాశ చెందాడు. స్టేడియానికి వచ్చిన తర్వాతే అతనికి కార్యక్రమం రద్దయిన వార్త తెలిసింది. దీనితో అసహనానికి గురైన బేడీ అక్కడే ఉన్న విలేఖరులు అడిగిన ప్రశ్నలకు అతను పూర్తిగా సమాధానాలు ఇవ్వకుండానే బయటకు వెళ్లిపోయాడు. తాను బిసిసిఐకి సంబంధించిన వ్యక్తిని కానని వ్యాఖ్యానించిన అతను అంతకంటే ఎక్కువ మాట్లాడేందుకు ఏమీ లేదని అన్నాడు.