రాష్ట్రీయం

వరంగల్‌లో కారు జోరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండో స్థానంలో కాంగ్రెస్!
బిజెపికి మూడో స్థానమేనా?
ఉత్సాహం చూపని పట్టణ ఓటర్లు

వరంగల్, నవంబర్ 21: వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక ఫలితాలు టిఆర్‌ఎస్ పార్టీకే అనుకూలంగా పోలైనట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఎన్నికలు ముగిసిన తరువాత పోలింగ్ సరళిలో కారు జోరే కొనసాగినట్లు సమాచారం. టిఆర్‌ఎస్‌కు దాదాపు 52 శాతంకు పైగా పోలింగ్ సరళి అనుకూలంగా ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. మిగతా 48 శాతంలో కాంగ్రెస్, బిజెపి, వై ఎస్సార్‌సిపి, వామపక్షాల మద్దతుతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ రెండవ స్థానం లో నిలుస్తుందని, బిజెపి మూడో స్థానంకే పరిమితమవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కారుదే పైచేయిగా ఉందని విశే్లషకులు అంటున్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు కాంగ్రెస్, బిజెపిలు గట్టి పోటీ ఇస్తాయని.. ఒక దశలో కాంగ్రెస్ గెలుస్తుందనే ప్రచారం జరిగినప్పటికీ క్రమక్రమంగా అంచనాలు తారుమారై తిరిగి అధికార పార్టీకే అనుకూలంగా మారినట్లు తెలుస్తుంది. బిజెపికి పాలకుర్తి, భూపాలపల్లి నియోజకవర్గాల్లో మినహా ఎక్కడ కూడా గట్టిపోటీ ఇవ్వలేకపోయిందని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, వర్థన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమలో టిఆర్‌ఎస్ హవా కొనసాగింది. పరకాలలో కూడా టిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీలో పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలో అధికార పార్టీకి పింఛన్ల పథకం భాగానే కలిసొచ్చినట్లు కనిపిస్తుంది. అదే విధంగా ఆర్‌టిసి ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా అధికార పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి దేవయ్యకు పోలింగ్ సరళి ఆశాజనకంగా లేదు. ఇప్పటికే వరంగల్ నగరానికి అనేక కేంద్ర పథకాలు కేటాయించినప్పటికీ ఫలితం మాత్రం మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో 76 శాతం పోలింగ్ నమోదు కాగా ఈ సారి 10 శాతం తక్కువైంది. వరంగల్ పశ్చిమలో అతితక్కువ పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికలో పట్టణ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. పరకాల, భూపాలపల్లి, పాలకుర్తి నియోజకవర్గాల్లో అధికార పార్టీతో పాటు బిజెపి నాయకులు కూడా కొన్ని ప్రాంతాల్లో డబ్బు పంపిణీ చేసినట్లు ఓటర్లే చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఎక్కడ కూడా డబ్బు పంపిణీ చేసిన సంఘటనలు బయటకు రాలేదు. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరిగినప్పటికీ పోలింగ్ మాత్రం వన్‌సైడ్‌గా మారిపోయింది.