ఎక్కడుంటే అక్కడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడ కెరీర్ వుంటే అక్కడే ఓ ఇల్లు కట్టుకోవడం బెస్ట్ అంటోంది అందాల నాయిక రాశిఖన్నా. ఆమె నటించిన చిత్రాలు ఇటీవల బాగానే విడుదలవుతున్నాయి. సినిమా హిట్టయినా ఫట్టయినా ఆమెకు ఏ సంబంధం లేకుండా అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో తన స్టార్ ఇప్పట్లో బాగానే ఉందన్న ముందుజాగ్రత్తతో, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దూరంగా వుండాల్సి వస్తోందన్న బాధతో రాశిఖన్నా ఇక్కడే ఇల్లు కట్టుకుంటోందట. ఇటీవల సిటీ సరిహద్దుల్లో ఆమె ఓ ఇంటి స్థలాన్ని కూడా కొనుగోలు చేసింది. ఇక ఇంటి నిర్మాణం ప్రారంభించి, త్వరలో టాలీవుడ్‌కు అందుబాటులో వుండేలా సన్నాహాలు చేసుకుంటోంది. ఏది ఏమైనా బాలీవుడ్‌నుండి వచ్చిన అమ్మాయిలు ముందు జాగ్రత్తతో వుంటారన్న నిజాన్ని రాశిఖన్నా కూడా రుజువు చేస్తోంది. (చిత్రం) రాశిఖన్నా