బిజినెస్

కార్గో హ్యాండ్లింగ్‌లో విశాఖ పోర్టు ట్రస్టు దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 12: ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి కార్గో హ్యాండ్లింగ్‌లో లక్ష్యాలను సాధించే దిశగా విశాఖపట్నం పోర్టు ట్రస్టు అడుగులు వేస్తోంది. గత ఏడాది దేశంలో కార్గో హ్యాండ్లింగ్‌లో సాధించిన ఐదో స్థానాన్ని నిలుపుకునేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 58 మిలియన్ టన్నుల మేరకు కార్గో హ్యాండ్లింగ్ చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. అయతే దేశంలో సరకు రవాణా రంగం ఈ ఏడాది అంత ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ తూర్పుతీరంలో ఉన్న ప్రధాన, చిన్న ఓడరేవుల్లో కార్గో హ్యాండ్లింగ్ గత ఏడాది కన్నా 5 శాతం మేరకు వెనుకబడింది. ఈ ఏడాది ఉక్కు ఉత్పత్తుల ఎగుమతి గణనీయంగా పడిపోవడం, చైనా నుంచి వివిధ ఉత్పత్తులు దేశీయ మార్కెట్లను ముంచెత్తడం దీనికి ప్రధాన కారణాలుగా పోర్టు వర్గాలు పేర్కొంటున్నాయి. కోకింగ్ కోల్ దిగుమతులు కూడా తగ్గాయి. దీనికి తోడు చైనాలో నెలకొన్న ప్రతికూల ఆర్థిక పరిస్థితులు. ఫలితంగా కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకున్నప్పటికీ, ఈ పరిస్థితుల్లో లక్ష్యాలను అధిగమించడం కష్టసాధ్యంగా మారింది. అయతే ఇతర పోర్టులతో పోలిస్తే విశాఖ పోర్టు పరిస్థితి మెరుగ్గా ఉందనవచ్చు. ప్రస్తుతం కేవలం 1 శాతం మాత్రమే కార్గో హ్యాండ్లింగ్ లక్ష్యానికి తక్కువగా ఉంది. ఈ మాసాంతానికి ఈ లక్ష్యాన్ని అధిగమించే వీలు ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కాగా, గంగవరం పోర్టు నుంచి విశాఖ పోర్టు తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హ్యాండ్లింగ్ చార్జీలను గంగవరం పోర్టు గణనీయంగా తగ్గించింది. ఇది కూడా విశాఖ పోర్టుపై కొంత మేరకు ప్రభావాన్ని చూపుతోందనవచ్చు.