రాష్ట్రీయం

హైకోర్టులో మీడియేషన్, ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: కోర్టులో కొనే్నళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి గాను శనివారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టులో మీడియేషన్, ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్ ప్రారంభించడంతో గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు అతి తక్కువ కాలంలో పరిష్కరమయ్యేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన హైకోర్టులో ఈ సెంటర్ శనివారం ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల లీగల్ సర్వీస్ అథారిటీ, హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్యర్యంలో రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలోని సి-బ్లాక్ బిల్డింగ్‌లో అధునాతన వసతులతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జస్టిస్ మదన్ బి లోకుర్ ప్రారంభించారు. మానవ హక్కుల గురించి క్షుణ్ణంగా విశదీకరించారు. ఒక కేసుకు సంబంధించి వాది, ప్రతి వాదికి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొల్పి, ఇద్దరి రాజీతోనే కేసును పరిష్కరించే దిశగా మీడియేషన్, ఆర్బిట్రేషన్ సెంటర్‌లు పనిచేయలన్నారు. కొన్ని కేసుల్లో బాధితులకు అందాల్సిన పరిహారంకంటే న్యాయవాది ఫీజులే భారమవుతున్నాయని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ఎంఎసి సెంటర్‌లలో కేసులు వాదించాలంటే న్యాయవాదులు 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండి మీడియేషన్, ఆర్బిట్రేషన్‌కు సంబంధించి 40 గంటలు శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు.