బిజినెస్

నాసిరకం మందుల తయారీపై ఔషధ నియంత్రణ మండలి కొరఢా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

147 కేసులు నమోదు: అకున్ సబర్వాల్
హైదరాబాద్, జనవరి 2: నాసిరకం ఔషధాల తయారీ కర్మాగారాలపై ఔషధ నియంత్రణ మండలి కనె్నర్రజేసింది. నాణ్యతకు తిలోదకాలిస్తున్న 147 ఫార్మా కంపెనీలపై కేసులు నమోదు చేసింది.
అదేవిధంగా రెగ్యులేషన్ లేని మరో 55 ఫార్మసీలపైనా కేసులు పెట్టామని ఔషధ నియంత్రణ మండలి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. మెడిసిన్, డ్రగ్గిస్ట్సు, ఫార్మాసిస్టులతో 259 అవగాహన సదస్సులు నిర్వహించి వివిధ మందుల ఉత్పత్తి కర్మాగారాలకు 83 లైసెన్సులు జారీ చేశామని, సక్రమంగాలేని 1,030 లైసెన్సులను సస్పెండ్ చేసినట్టు ఔషధ నియంత్రణ మండలి పేర్కొంది. నకిలీ మందుల ఉత్పత్తులపై నిఘా వేసి 4,715 శాంపిళ్లను సేకరించి పరిశీలించామని, అందులో 59 మందులు నాసిరకంగా గుర్తించినట్టు ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. మరో 64 రకాల మందుల ధరలకు సంబంధించి కూడా కేసులు నమోదయ్యాయని, వీటిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా 139 బ్లడ్ బ్యాంకులను ఆకస్మికంగా తనిఖీ చేసి వీటిలో 109 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ చేశామని, అలాగే 25 కేసుల్లో శిక్ష పడిందని ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలియజేశారు.